Love Me :
ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమాలో నటించి అందరితో శహభాష్ అనిపించుకునే హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు.
అలాంటి అరుదైన ఫీట్‌ను టాలీవుడ్ హీరోయిన్ అచ్చతెలుగు పదహారణాల తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య సాధించింది.
‘బేబి’ సినిమాలో ప్రేమించిన వాణ్ని ఏమార్చే (మోసం చేసే) పాత్రలో నటించి తన నటనకు సెంట్ పర్సెంట్ మార్కులు సాధించింది హీరోయిన్ వైష్ణవి చైతన్య.
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీనుండి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు భామ గురంచి నేషనల్ స్టార్ అల్లు అర్జున్ ‘బేబి’ సక్సెస్‌మీట్‌లో ఎంత గట్టిగా మాట్లాడారో అందరికి తెలిసిందే.
ఈమెకోసమే సక్సెస్‌మీట్ పెట్టారా? అన్నట్లుగా వైష్ణవిని, ‘బేబి’ టీమ్‌ని ఆకాశానికి ఎత్తేశాడు బన్నీ. ఆ అమ్మాయి నటనలో ఉన్న చార్మ్ ఓ పక్క బన్నీ మాట్లాడటం ఓ పక్క ఏదైతేనేం మొత్తానికి ఫస్ట్ సినిమాతోనే లక్కీ లేడి అనిపించుకుంది వైషు.
ఇప్పుడు ఈ తెలుగుపాప ‘దిల్’ రాజు బ్యానర్‌లో ‘లవ్‌మీ’ అనే సినిమా చేసి మే25న థియేటర్లలో సందడి చేయటానికి సిద్ధమైంది.
కుర్రోళ్లకు మరో ప్రేమబాణాన్ని వేయటానికి రెడీ అంటుంది. ‘లవ్‌మీ’ సినిమా హీరో ఆశిష్ కూడా ఓ సినిమా చేసిన హీరోనే కాబట్టి అటు హీరోయిన్, ఇటు హీరోకి ఇద్దరికి ఈ సినిమా విజయం అత్యంత కీలకం.
ఈ సినిమాకి ‘దిల్’ రాజు, ఆస్కార్ విజేత యం.యం కీరవాణి తదితర ప్రముఖులంతా బ్యాక్‌ఎండ్‌లో సపోర్ట్ చేస్తున్న యూత్ మాత్రం
కేవలం వైష్ణవి చైతన్య ఏం మాయ చేయబోతుందో అనే మూడ్‌లోనే సినిమా థియేటర్లలోకి ఎంటర్ అవుతారు అనేది ట్రేడ్ టాక్.
తర్వాత ఎవరు ఎంత బాగా నటించారు, ఎవరికి ఎన్ని మార్కులు పడ్డాయి అనే విషయం అందరు సినిమా చూసిన తర్వాత మాట్లాడతారు.
కానీ ఒకే ఒక్క సినిమాలో నటించి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న టాలీవుడ్ భామలు అతి తక్కువనే చెప్పాలి.
మొత్తానికి అటువంటి ఫీట్‌ని అతి సునాయసంగా దాటి తన నటనతో ఫ్యాన్స్‌దగ్గరే కాకుండా సినిమా చూసే ప్రేక్షకుల దగ్గర కూడా ఆమె శహబాష్ అనిపించుకుంటుంది అని అందరూ మాట్లాడుతుంటే మాత్రం భలే అనిపించింది.
ఓ తెలుగు హీరోయిన్‌కి చాలాకాలం తర్వాత కంటెంట్ ఉన్న కటౌట్ మార్కెట్‌కు వచ్చింది అనే మార్క్‌ను కొట్టేసింది వైష్ణవి.
చూడాలి ‘లవ్‌మీ’ చిత్ర విడుదల తర్వాత కూడా వైష్ణవి చైతన్య గ్రాఫ్ ఎలా ఉంటుందో, ఆమె గురించి జరిగే డిస్కషన్స్ ఎలా ఉంటాయో…….
శివమల్లాల
Also Read This : ఎన్టీఆర్ దేవరకు జన్మదిన శుభాకాంక్షలు
