ఓటీటీలోకి అదిరిపోయే ట్విస్టులతో కూడిన లాఫింగ్ రైడర్..

ట్విస్టులతో కూడిన లాఫింగ్ రైడర్ మూవీస్ కొన్నే ఉంటాయి. ప్రేక్షకుడికి కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి. అలాంటి చిత్రమే థియేటర్స్‌లో విడుదలై అలరించి ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అరుణ్ డి. జోస్ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రొమాన్స్’ చిత్రం ఓటీటీ మాధ్యమం సోనీ లివ్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహంపై , హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాల మేళవింపుతో ఈ మలయాళ సినిమా తెరకెక్కింది. థియేటర్స్‌లో ఈ సినిమాను చూడలేకపోయినవారు ఆ మ్యాజిక్‌ను మే 1 నుంచి ఆస్వాదించవచ్చు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ.. ‘‘బ్రొమాన్స్’ చిత్రం అందరి హృదయాలను హత్తుకున్న ఫ్రెండ్ షిప్ స్టోరి. ఈ సినిమాలో చక్కటి డ్రామా, సస్పెన్స్ వంటి ఎన్నో ఎలిమెంట్స్‌ ఉండటం వల్ల ఇది ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. కనిపించకుండా పోయిన ఒక స్నేహితుడిని వెతికే స్నేహితుల కథే ‘బ్రొమాన్స్’’ అని పేర్కొన్నారు. అసలు సినిమా కథేంటంటే.. బింటో అనే యువకుడు కనిపించుకుండా పోయిన తన సోదరుడిని వెదికేందుకు అతని స్నేహితుల సాయంతో ప్రయత్నిస్తాడు. ఈ కథంతా రాత్రి సమయంలోనే నడుస్తుంది. ఊహించని ట్విస్టులు, మరచిపోలేని జ్ఞాపకాలతో వారి ప్రయాణం సాగుతుంది. ఈ కథ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది. అరుణ్ డి.జోస్, రవీష్ నాథ్, థామస్ పి.సెబాస్టియన్ రాసిన ఈ కథను అషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఇందులో అర్జున్ అశోకన్, భరత్ బోపన్న, శ్యామ్ మోహన్, మహిమ నంబియార్, మాథ్యూ థామస్, కలభవన్ షాజోన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *