Laggam :
విడుదల తేది . 25–10–2024
నటీనటులు : సాయిరోనక్, ప్రజ్ఞా నగ్ర, రాజేంద్రప్రసాద్, రోహిణి, వడ్లమాని శ్రీనివాస్, ఎల్బి. శ్రీరామ్, రఘుబాబు, సప్తగిరి, రచ్చ రవి, చమ్మక్ చంద్ర, కృష్ణుడు, ప్రభాస్ శ్రీను, వివారెడ్డి, రవివర్మ,కనకవ్వ తదితరులు
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : బాల్ రెడ్డి
సంగీతం : చరణ్ అర్జున్
నేపధ్య సంగీతం : మణిశర్మ
నిర్మాత : సుభిషి వేణుగోపాల్ రెడ్డి
మాటలు– స్క్రీన్‌ప్లే–దర్శకత్వం : రమేశ్ చెప్పాల
కథ :
తల్లి లేని కూతురుని అయ్యే పాపం అనటం సహజం..కానీ ఎవరి సానుభూతి ఇష్టం లేకుండా వారి లైఫ్ వారు అనుభవించేవారికి మాత్రం
ఎవరన్నా సానుభూతి చూపిస్తే చాలా కష్టంగా ఉంటుంది.
అలాంటి ఇబ్బందిని అనుభవించే తల్లిలేని కూతురు హీరోయిన్ ప్రజ్ఞా నగ్ర (మానస) . రాజేంద్రప్రసాద్ ఒక్కగానొక్క ముద్దుల కూతురు.
మానసకు చెల్లి కుమారుడు తనకు మేనల్లుడు వరసయ్యే సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా హైదరాబాద్‌లో పనిచేసే సాయిరోనక్‌కి ఇచ్చి లగ్గం చేయాలనుకుంటాడు రాజేంద్రప్రసాద్.
ఇరు కుటుంబాలతో పాటు వధూవరులిద్దరు ఇష్టపడటంతో సరే అంటే సరే అని పెళ్లికి రెడి అవుతారు. ఇంకో గంటలో పెళ్లి జరుగుతుందనగా అనుకోని కారణలతో పెళ్లి ఆగుతుంది.
అందరు ఒకే అనుకున్న పెళ్లి ఎందుకు ఆగింది? అమ్మాయి తరపువారిది తప్పా? అబ్బాయి తరపు వారిదా? ఈ సమయంలో పెళ్లికూతురు, పెళ్లి కొడుకుల మానసిక స్థితి ఎలా ఉంది?
లగ్గం సినిమాలో విలన్లు ఎవరు? ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానం సినిమా చూస్తే తెలుస్తుంది.
పేరుకు లగ్గం అని పెట్టారు కానీ సినిమాలో ఎన్నో ఎమోషన్స్‌కు ప్రస్తుత సమాజంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు.
నటీనటుల పనితీరు :
లగ్గంలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం నిస్సందేహంగా రోహిణిగారు అనే చెప్పాలి.
ఓ పక్క హీరోకి అమ్మగా మరో పక్క హీరోయిన్ ప్రజ్ఞకు మేనత్తగా రాజేంద్రప్రసాద్‌గారికి చెల్లిగా వడ్లమాని శ్రీనివాస్‌గారికి భార్యగా ఇలా అందరితో రిలేషన్‌ను పంచుకునే పాత్రలో చాలా బాగా నటించారామె.
లగ్గం సినిమా కథా నేపధ్యం పూర్తి తెలంగాణాలో ఉండటంతో కొన్ని పాత్రలు కావాలని పట్టి పట్టి తెలంగాణా మాండలికాన్ని మాట్లాడటం ఇట్టే తెలిసిపోతుంది.
హీరోగా సాయిరోనక్‌కు తన గత చిత్రాలతో పోల్చుకుంటే ‘ లగ్గం’ మంచి సినిమా అవుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంత బాగా నటించారో పల్లెటూరి కుర్రానిలా కూడా చాలా బాగా నటించారు సాయిరోనక్.
ప్రజ్ఞ కొన్ని చోట్ల మెరిపించింది. వడ్లమాని శ్రీనివాస్ తెలంగాణ యాసలో బాగా మాట్లాడారు.
ర ఘుబాబు పాత్రతో పాటు, బర్రెలన్న పాత్రలో నటించిన రచ్చ రవి పాత్ర కూడా బావుంది. సప్తగిరి, చమ్మక్ చంద్ర, కిరిటీ పాత్రలు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
టెక్నికల్ విభాగం :
కెమెరామెన్ బాల్ రెడ్డి లగ్గం సినిమాకి అద్భుతమైన కెమెరా పనితనంతో స్క్రీన్‌కి కలర్‌ఫుల్‌గా మలిచారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అందించిన రెండుపాటలు బావున్నాయి.
మిగతావి అంతగా ఎక్కలేదు. మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఫస్ట్‌హాఫ్‌లో మైనస్ మార్కులు పడగా, సెకండ్ హాఫ్‌లో సినిమాకి ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ అనిపించింది.
సినిమా ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ చేసిన కట్ లగ్గంకు సరిగ్గా కుదిరింది. ఈ చిత్రానికి తన దర్శకత్వంతో పాటు మాటలను అందించిన రమేశ్ పనితనమంతా సెకండ్ హాఫ్‌లో ఉంది.
ప్రతి ఒక్కరు ఆయన రాసిన డైలాగులకు ఎక్కడో ఓ చోట ఖచ్చితంగా ఫీలవుతారు. డైలాగ్స్ అంతలా ఆకట్టుకుంటాయి.
ప్లస్ పాయింట్స్ :
పెళ్లిళ్లపై సెటైర్
నటీనటుల పనితీరు
కెమెరా వర్క్
సెకండ్‌హాఫ్‌లో కొన్ని సీన్లు
బ్యూటిఫుల్ ఫ్యామిలీస్టోరి
ఆలోచించే విధంగా ఉండే మాటలు
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్‌హాఫ్‌లో ఉండే కొన్ని అనవసరమైన సీన్లు
తెలంగాణా భాషను పట్టి పట్టి మాట్లాడే నటులు
ఫైనల్ వర్డిక్ట్ :
పర్‌ఫెక్ట్ థియేట్రికల్ మూవి
రేటింగ్ : 3/5
శివమల్లాల
Also Read This : సోషల్ మీడియా వ్యసనం మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది