...

Kumari aunty food stall: సీఎం ఆదేశం కుమారి ఆంటీ షాక్

Kumari aunty food stall: మీడియా / యూ ట్యూబర్లు మూలంగా పాపులర్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు, పోలీస్ ల ఆదేశాలతో మూతపడి, మళ్ళీ

ఒక్క రోజులోనే – మీడియా మూలం గానే పునర్జీవనం పొందిందని, చెప్పొచ్చు.

కుమారీ ఆంటీని అదే ప్లేస్ లో వ్యాపారం చేసుకోనివ్వండి..! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

స్ట్రీట్‌ ఫుడ్‌ కుమారి ఆంటీ షాపు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

ట్రాఫిక్ పోలీసుల కేసును పునఃపరిశీలన చేయాలని డీజీపీకి సూచించారు.

ఉన్న ప్లేస్ లోనే వ్యాపారం చేసుకోనివ్వాలని స్పష్టం చేశారు.

 

ట్రాఫిక్ సమస్య విషయంలో తాజాగా ఆమెపై కేసు నమోదు చేసిన కేసును పునఃపరిశీలన చేయాలని డీజీపీని ఆదేశించారు.

ఫుడ్‌ స్టాల్‌ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కుమారి పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చని

ప్రకటించారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని కూడా సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అదే జరిగితే, ఇక ఆమె ఫుడ్ కోర్టు కి

తిరుగుండదు – అసలైన దశ తిరుగుతుంది.

kumari aunty food stall Hyd
Kumari aunty food stall Hyd

ఆమె మాట్లాడిన రెండు లివర్లు వెయ్యి రూపాయిలు అనే డైలాగ్ నెట్టింట వైరల్

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్న కుమారీ ఆంటీ – సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫేమస్ అయ్యింది.

యూట్యూబ్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ కుమారీ ఆంటీ వైరల్ అయ్యింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ అమాంతం పెరిగింది.

యూట్యూబ్ వీడియోస్ తో కస్టమర్స్ కూడా బాగా పెరిగాయి. ఆమె మాట్లాడిన రెండు లివర్లు వెయ్యి రూపాయిలు అనే డైలాగ్ నెట్టింట వైరల్

అయ్యింది. ఇక యూట్యూబ్ ఛానల్స్ కుమారీ ఆంటీ వీడియోస్ కోసం క్యూకట్టారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడంతో యువత కుమారీ ఆంటీ

ఫుడ్ స్టాల్ కు పోటెత్తారు.

సరిగ్గా – ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కుమారీ ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ భారీగా పెరిగింది.

దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు.

ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని షాపు మూసివేయాలని కోరారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, కుమారీ ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది.

 

ఇటీవల ఊరి పేరు భైరవ కోన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ కూడా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ప్రచారం

చేసి ఆమె చేతివంటి రుచి చూశారు. దీంతో కుమారీ ఆంటీ ఫుడ్ కు మరింత గిరాకీ పెరిగింది. గిరాకీ పెరగడంతో ఆ మార్గంలో వాహనాల రద్దీ పెరిగి

ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో కుమారీ ఆంటీ ఫుడ్ ట్రక్కును పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదని, ఈ ఫుడ్ స్టాల్

వల్ల ట్రాఫిక్ బ్లాక్ అవుతోందని తెలిపారు. అంతేకాకుండా కుమారీ ఆంటీ ఫుడ్ ట్రక్కును కూడా సీజ్ చేశారు. దీంతో కాసేపు కుమారీ ఆంటీ

కుటుంబానికి, పోలీసులకు మధ్య గొడవ జరిగింది.

తనకు ఇంత పేరు రావడానికి మీడియానే కారణమని, ఈ కష్టకాలంలో తనకు మీడియానే న్యాయం చేయాలని కుమారీ ఆంటీ వేడుకున్నారు.

తనకు న్యాయం చేయాలని అన్నారు. పక్కనున్న స్టాల్ ను తొలగించకుండా తన ఫుడ్ స్టాల్ మాత్రమే మూసివేశారని ఆమె ఆరోపించారు.

ఈ మొత్తం ఎపిసోడ్, సీఎం రేవంత్ కి తెలిసి, మొత్తం సమస్య ని సాల్వ్ చేస్తూ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

ప్రస్తుతం ఉన్న చోటనే వ్యాపారం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కేసును కూడా విత్ డ్రా చేసుకోవాలని పోలీసులకు సూచించారు.

కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు అయితే మళ్ళీ రష్ విపరీతంగా పెరిగింది – ఆ పరిసర ప్రాంతాలు మొత్తం, రద్దీ అయి, వాహన దారులు

ఇబ్బంది పడుతున్నారు.

Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?

Mega star

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.