Kubera: మోస్ట్ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందన ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్‌పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘‘శేఖర్ కమ్ముల గారు ‘లవ్ స్టోరీ’ తర్వాత ‘కుబేర’ ఐడియాని మాకు చెప్పడం జరిగింది. ఈ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ గారు కథ 20 నిమిషాలు విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాము. ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారు గురించి అందరికీ తెలుసు. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని చేయడం జరిగింది. శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్‌తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ని క్యారెక్టర్స్ గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.

మోస్ట్ రిచెస్ట్ మాన్ ఇన్ ద వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్ ఇది ‘కుబేర’ కాన్ఫ్లిక్ట్. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్ లో తీసాము. బొంబాయిలో సినిమాని సూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని సూట్ చేయడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్. మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్‌కు కావలసిన బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.

నాగార్జున గారితో వర్క్ చేయాలని మాకు ఎప్పటినుంచో ఉండేది. శేఖర్ గారికి ఈ పాత్ర కోసం నాగార్జున గారు తప్పితే మరొకరు కనిపించలేదు. నాగ్ సర్ కి ఈ కథ నచ్చింది. ఆయన చాలా అద్భుతంగా నటించారు. ఆయన్ని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంత గొప్పగా పెర్ఫార్మ్ చేశారు. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ గారు రెండు పాటలు పాడారు. దీని తర్వాత కూడా శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు’’ అని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *