Konda Surekha :
‘ పెదవి దాటని మాటకి మీరు రాజయితే, పెదవి దాటిన మాటకి మీరు బానిస’…ప్రస్తుతం తెలుగు రాజకీయాలకు ఇది సరైన సూక్తిలా అనిపిస్తుంది.
నోటికి ఏ మాట వస్తే ఆ మాటను అలవోకగా అనేస్తున్నారు. మాటలు అనేసిన తర్వాత అయ్యో మేము ఇలా అన్నామా? తూచ్ అని నాలుక కరుచుకుంటున్నారు.
పూర్తిస్థాయి రాజకీయల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు నిందలు మోపుకుంటూ,
తిట్టుకుంటూ సంబంధం లేని మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి మాట్లాడటం అనేది ఏ సందర్భంలోను ఒప్పుకునే అంశం కానేకాదు.
అది రాజయినా, మంత్రయినా, బంటయినా ఇక్కడ అందరూ ఒక్కటే. మనందరం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం.
మీరు చేసే మంచిపనుల వల్ల లబ్దిపొందినవారు ఎంతో తృప్తిగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది చాలా తక్కువమందికి మాత్రమే తెలుస్తుంది.
ఇలా మంచి పేరు సంపాదించుకోవటానికి చాలా ఎక్కువ సమయం ఎక్కువ రోజులు, ఏళ్లు పట్టొచ్చు.
కానీ, మనం చేసే చెడు మాత్రం చాలా కొద్ది సమయంలోనే ప్రపంచమంతా దావనంలా విస్తరిస్తుంది. ప్రస్తుతం కొండా సురేఖా గారి పరిస్థితి ఇలానే ఉంది.
ఆమె ఎవ్వరికి మంచి చేశారో వాళ్లకు తెలుస్తుంది. కానీ ఈ రోజు సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌ల గురించి ఆమె మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్నే రగిల్చాయి.
ముఖ్యంగా సొసైటిలో ఎంతో హుందాగా బతుకుతున్న నాగార్జున వంటి వ్యక్తిని అనకూడని మాటలు అని
నాగచైతన్యని వారి రాజకీయాల్లోకి లాగటం అనేది దారుణమైన చర్య అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు.
చిత్ర పరిశ్రమలోని పలువురు ముఖ్యంగా చిరంజీవి స్పందిస్తూ ‘ సిగ్గుపడేలా ఆమె మాటలు ఉన్నాయని ఎంతో బాధ పడ్డానని ఇలాంటి దిగజారే పరిస్థితి నాయకులకు వచ్చినందకు సిగ్గుచేటు’’ అన్నారు.
ప్రకాశ్‌రాజ్, యన్టీఆర్, నాని, నాగార్జున కుటుంబ సభ్యులు అందరూ తీవ్రంగా కొండా సురేఖా అన్న మాటలను వ్యతిరేకిస్తున్నారు.
అలాగే మాజీ మంత్రి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కెటిఆర్ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆమెకు నోటిసులు ఇచ్చారు.
చూడాలి ఇకపై ఈ సంఘటనకి సంబంధించి సినిమా సమాజం ఎలా రియాక్ట్ అవుతుందో……
శివమల్లాల
Also Read This : చిరంజీవికి గిన్నిస్‌లో స్థానం…