IPL 2025 :
హైదరాబాద్ జట్టును చిత్తు చేసిన కలకత్తా నైట్ రైడర్స్.
తొలుత బ్యాటింగ్ చేసిన కలకత్తా జట్టు 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.
201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 120 పరుగులు మాత్రమే చేసి లక్ష్యానికి 80 పరుగుల ఓటమిని మూటకట్టుకుంది సన్రైజర్స్ జట్టు.
కలకత్తా జట్టు బ్యాటర్ రఘువంశి 50 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు.
తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు (7×4, 3×6) బాది రన్రేట్ ను అమాంతం పెంచేశాడు.
మితిమీరిన ఉత్సాహం తో బ్యాటింగ్కి దిగిన సన్రైజర్స్ 10 పరుగులు కూడా చేయకుండానే 3 టాప్ ఆర్డర్ కీలకమైన వికెట్లు కోల్పోయింది.
మొదట్లోనే ఇబ్బంది పడిన ఎస్ ఆర్ చ్ జట్టు ఏ సమయంలోనూ కలకత్తా జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది.
16.4 ఓవర్లలో అల్ ఔట్ అయ్యి హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది.