ఢిల్లీ వేదికగా జరిగిన 48 వ ఐపీఎల్ t-20 మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కలకత్తా నైట్ రైడర్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా జట్టు తొలి బంతి నుంచి ధాటిగా ఆడింది. కలకత్తా టీంలో ఎవరూ హాఫ్ సెంచరీ పూర్తి కాకుండానే వెనుదిరిగినప్పటికీ ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 204 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్స్ గుల్బర్గ్ 12 బంతుల్లో 26 పరుగులు (5 ఫోర్లు 1 సిక్సర్), నరేన్ 16 బంతుల్లో 27పరుగులు (2 ఫోర్లు 2 సిక్సర్లు), 14 బంతుల్లో 26 పరుగులు (4 ఫోర్లు 1 సిక్సర్ ) రఘువంశీ 32 బంతుల్లో 44 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) రింకూసింగ్ 25 బంతుల్లో 36 పరుగులు (3 ఫోర్స్ సిక్సర్) రస్సెల్ 9 బంతుల్లో 17 పరుగులు (2 ఫోర్లు 1 సిక్సర్ ) వేగంగా పరుగులు చేయటంతో నెట్ రన్ రేట్ పెరిగింది. ఢిల్లీ బౌలర్లు స్టార్క్ 3 వికెట్లు, విప్రాజ్, అక్సర్ పటేల్ లు రెండేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ డుప్లెసిస్ 45 బంతుల్లో 62 పరుగులు (7 ఫోర్లు 2 సిక్సర్లతో) భాద్యతగా ఆడినప్పటికీ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్కు దిగిన పొరల్ , కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ తక్కువ పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అక్సర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ 23 బంతుల్లో 43 పరుగులు ( 4 ఫోర్లు 3 సిక్సర్లు) కొట్టి ఆశలు రేపాడు. తాను అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పై కలకత్తా పూర్తి పట్టు సాధించింది. చివరిలో విప్రాజ్ బ్యాటింగ్‌తో 19 బంతుల్లో 38 పరుగులు ( 5 ఫోర్లు,2 సిక్సర్లు) చేసి స్కోరును 190 పరుగుల వరకూ చేర్చటంలో కీలక భూమిక పోషించాడు. 14 పరుగుల తేడాతో కోలకత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
శివ మల్లాల
Also Read This : ఆ స్టార్ హీరో ‘యమలీల’తో ఎంట్రీ ఇస్తే ఎలా ఉండేదో ?