హీరోయిన్ కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులతో ఆశీర్వచనం అందుకున్నారు….
ఆలయ అధికారులు శ్రీవారి తీర్ధప్రసాదలు అందజేశారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ : “త్వరలోనే పెళ్లి చేసుకోబోటునట్లు, వివాహానికి ముందు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.
తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీతో చాలా కాలంగా ప్రేమలో ఉన్నానని,
పెద్దల సమక్షంలో వచ్చే నెల గోవాలో వివాహం చేసుకోబోతున్నాం అని తెలిపారు.
ప్రస్తుతం బేబీ జాన్ అనే హిందీ చిత్రంలో నటిస్తుంది కీర్తి సురేష్.
సంజు పిల్లలమర్రి
Also read this : ఘనంగా నాగచైతన్య శోభితాల హల్దీ వేడుక..