విడుదల తేదీని ప్రకటించుకున్న కీర్తి సురేష్ సినిమా

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రివాల్వర్‌ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగానూ.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతోంది. ఈ సినిమా మొత్తానికి విడుదల తేదీని ప్రకటించుకుంది. విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ ఒక వీడియోను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయనున్నట్టు సదరు వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కీర్తి సురేశ్ ఒక పోస్ట్‌ర్‌ను షేర్ చేశారు.

తాజాగా విడుదలైన వీడియో చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రెడిన్‌ కింగ్‌స్లీ, మైమ్‌ గోపీ, సెండ్రాయిన్, స్టంట్‌ మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేశ్ విషయానికి వస్తే.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ‘బేబీ జాన్’ బాలీవుడ్ ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేశ్.. ‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *