KCR : తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు.

KCR :

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలనే పిటీషన్‌ను కేసీఆర్ దాఖలు చేశారు. ఈ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తన పిటీషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ పిటీషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా, కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆధిత్య వాదనలు వినిపించారు.

అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే కేసీఆర్ పిటీషన్‌ను డిస్మిస్ చేశారు, తద్వారా కమిషన్ విచారణను కొనసాగించవచ్చని తీర్పు చెప్పారు.

జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి నేతృత్వంలో విద్యుత్ కొనుగోళ్లు వ్యవహారంపై విచారించేందుకు కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేసింది.

గత ప్రభుత్వంలో సీఎండీగా ఉన్న ప్రభాకర్ రావుకి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. అతని స్టేట్‌మెంట్‌ను కమిషన్ సభ్యులు రికార్డు చేశారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా కమిషన్ రెండుసార్లు నోటీసులు ఇచ్చింది. ఆ రెండు సార్లు కేసీఆర్ విచారణకు హాజరుకాలేదు.

దీనికితోడు నరసింహా రెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. నరసింహా రెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, ప్రస్తుతం ఆ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది.

తాజా కోర్టు తీర్పుతో మరోసారి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని కమిషన్ భావిస్తోంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు మరోసారి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వబోతున్నారు.

ఏ తేదీన విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులు ఇస్తుందని ఆసక్తికరంగా మారింది.

ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తారా? లేదా కమిషన్ నోటీసులు ఇస్తే వారు సూచించిన తేదీన విచారణకు హాజరవుతారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

Also Read This : ఏపీ లో ఎన్‌టిఆర్ పింఛన్‌ భరోసా పింఛన్ల పంపిణీ

Kirak RP
Kirak RP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *