Kalki Collections : అన్ని రికార్డులను చెరిపేసిన కల్కి…ఆ ఒక్క రికార్డు తప్ప…

Kalki Collections :

రాజమౌళి దారిలోనే నాగ్‌అశ్విన్‌

అద్భుతాలు జరిగినప్పుడు ఎంజాయ్‌ చేయాలి. వాటిగురించి పెద్దగా డిస్కషన్‌ పెట్టకూడదు. అలాంటి అద్భుతాలు రాజమౌళి ‘బాహుబలి’ పుణ్యమా అని ఈ దశాబ్దకాలంలో చాలానే చూశాము.

ముఖ్యంగా తెలుగు సినిమా అద్భుతాలు ప్రారంభమైంది ‘బాహుబలి’ సినిమాతోనే. అప్పటివరకు కూడా తెలుగు సినిమా ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించింది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమా తర్వాత తెలుగు సినిమా మార్కెట్‌ను అమాంతం పెంచింది మాత్రం నిస్సందేహంగా రాజమౌళినే అని ఖచ్చితంగా చెప్పుకోవాలి.

ఒక్క ‘బాహుబలి’ సినిమా తర్వాత బడ్జెట్‌ను పెంచి సినిమాలు తీసినాకూడా మార్కెట్‌ పరంగా ప్రాబ్లెమ్‌ ఉండదు అని రుజువు కావటంతో తర్వాత కాలంలో అనేకమంది దర్శకులు సినిమా తీసే విధానంలో మార్పు వచ్చింది.

నిర్మాతల దృష్టికోణం కూడా పూర్తిగా మారిపోయింది. రాజమౌళి కోవలోనే కొంతమంది సౌతిండియా దర్శకులు ఉదాహరణకు

కెజిఎప్‌తో ప్రశాంత్‌ నీల్, హనుమాన్‌తో ప్రశాంత్‌వర్మ, ఇప్పుడు లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘కల్కి’తో నాగ్‌అశ్విన్‌లు మార్కెట్‌ను యూజ్‌ చేసుకుని నెక్ట్స్‌ లెవెల్‌కి వెళ్లే సినిమాలు చేశారు. చేస్తున్నారు కూడా.

ముఖ్యంగా ‘కల్కి’ సినిమా విడుదల రోజే గతంలో ఉన్న అన్ని తెలుగు సినిమా రికార్డులను కాలరాసింది.

కానీ యన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రికార్డుని మాత్రం కొద్దిలో చేజారింది.

ఏదేమైనా ప్రభాస్‌ తన పేరుమీదున్న రికార్డులన్నింటిని ‘కల్కి’ సినిమా మొదటిరోజు వచ్చిన కలెక్షన్లతో తన రికార్డులను తానే అధిగమించారు.

ఒక్క ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మొదటిరోజు కలెక్షన్లను తప్ప మిగతా అన్ని సినిమాలను మించిపోయాయి. కటౌట్‌ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డూడ్‌ అంటూ తన కటౌట్‌ గురించి తానే ‘మిర్చి’ సినిమాలో వాడిన డైలాగ్‌ను ఈ కలెక్షన్లతో మరోసారి ఆ డైలాగ్‌ను

గుర్తుచేసేలా చేశారు ప్రభాస్‌.

       శివమల్లాల

Also Read This :  కల్కి సినిమా రివ్యూ…

Kalki Movie Review
Kalki Movie Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *