Kalki 2898 AD :
విడుదల తేది : 27–06–2024
నటీనటులు : అమితాబచ్చన్, ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకునే, శోభన, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, ఎస్.ఎస్.రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, మాళవిక నాయక్, మృణాల్ ఠాకూర్, అన్నాబెల్, హర్షిత్,
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ : జార్జి
సంగీతం : సంతోష్ నారాయణ్
నిర్మాత : సి.అశ్వనీదత్
కథ–స్క్రీన్‌ప్లే– దర్శకత్వం : నాగ్‌అశ్విన్
సినిమా కథ :
2898లో ప్రారంభమైన సినిమా కథలో కాంప్లెక్స్‌లా కట్టిన అద్భుతమైన కట్టడంలో అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటుచేసి
సుప్రీం (కమల్‌హాసన్) క్యారెక్టర్ అనేక ప్రయోగాలు చేసి యువతులకు శాస్త్రీయ పద్ధతిలో పిల్లల్ని కనే విధంగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.
అలా బిడ్డలు మోసే యువతులు 3నెలలు నిండకుండానే కడుపులోని బిడ్డను మోయలేని స్థితిలో ఉంటారు. అప్పుడు కడుపులో బిడ్డ యొక్క స్టెమ్‌సెల్‌ని సేకరించి సుప్రీంకి అందచేస్తే సుప్రీం మామూలు రూపంలోకి వచ్చే అవకాశం ఉంది.
ఎంతమందిని పరీక్షించినప్పటికి తనకు కావాల్సిన స్టెమ్‌సెల్ దొరక్కపోవటంతో విసిగిపోయిన సుప్రీం దాదాపు 150 రోజుల పాటు బిడ్డను మోసిన యువతి ఎవరైనా ఉన్నారా? అని వెతికే పనిలో పడతారు.
అప్పుడు 150 రోజులకు పైగా ల్యాబ్‌లో బిడ్డను మోసిన యువతి దీపికపదుకునే (సుమతి)నుండి స్టెమ్‌సెల్ సేకరిస్తారు సుప్రీం అండ్ టీమ్.
ఒక్కసారి స్టెమ్‌సెల్ తీసిన తర్వాత ఆ యువతులను కాల్చి బూడిద చేయటం ల్యాబ్ ఆచారం. అటువంటి సమయంలో ల్యాబ్ చేసే అక్రమాలను అడ్డుకోవటానికి ఒక రెబల్ వర్గం ఉంటుంది.
చివరి నిమిషంలో దీపిక రెబల్ సాయంతో అక్కడినుండి తప్పించుకుంటుంది. అలా తప్పించుకునే క్రమంలో దీపిక ఎక్కడికి వెళుతుంది? ఎవరు ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తారు? ఆమెను అపహరించటానికి ప్రయత్నిస్తున్నది ఎవరు?
అనే కథ ఒకవైపు జరుగుతూ ఉంటుంది. మరోవైపు కాంప్లెక్స్‌కు పక్కనే ఉన్న వీధుల్లో›బుజ్జి అనే కారులో అందరి దగ్గర అప్పులు చేసుకుంటూ అందరిని తప్పించుకుంటూ తిరిగే భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటించారు.
ఆయనెప్పుడు దూరంగా కనిపించే ఇంద్రభవనం లాంటి కాంప్లెక్స్‌లోకి వెళదామా అని చూస్తుంటాడు. మరోవైపు మహాభారతంలోని అశ్వద్ధామ పాత్రను పోషించారు ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్.
ఆయన ఒక గుహలో కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. సడెన్‌గా అక్కడికి వచ్చిన బాలుడిని కాపాడి అతని దగ్గరున్న ఒక రాయిని తీసుకుని నుదుట పెట్టుకోవటంతో అశ్వద్దామ శక్తిని తిరిగి పొందుతాడు.
ఇప్పుడు ఈ పాత్రలన్ని ఒక్కో దగ్గర నుండి శంభాల అనే ప్రాంతానికి వెళ్లటానికి సిద్దమవుతాయి.
అక్కడ మరియం (శోభన) వీరి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడనుండి అందరూ శంభాలకు చేరుకున్నారా?
దీపికా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం నుండి వీళ్లందరికి రక్షించేది ఎవరు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఖచ్చితంగా సినిమా థియేటర్‌లో సినిమాను చూడాలి.
నటీనటుల పనితీరు–
ఈ సినిమాలో హీరో ప్రభాస్ అయినప్పటికి ‘కల్కి’ మొదటి పార్ట్‌లో ఆయన విన్యాసాలు కొంతమేరకే ఉన్నాయి. అలాగే తన పాత్ర తాలూకు పరిచయం మాత్రమే జరగిందని చెప్పాలి.
భైరవ పాత్రలో తనకున్న స్క్రీన్‌టైమ్‌లో ప్రబాస్ తన ఫ్యాన్స్‌కి ఏం కావాలో అలా కనిపించారు. మొత్తానికి ప్రభాస్ ఏ సినిమా చేసినా తన స్టామినా ఏంటో చూయించే ప్రయత్నం బాగా చేశారు.
‘కల్కి’ పార్ట్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమితాబ్ గురించే. చాలాకాలం తర్వాత వయసు నంబర్ మాత్రమే అని తన నటనతో నిరూపించారు అమితాబ్.
ఈ సినిమాతో ఆయన మరోసారి ఇండియన్ సూపర్‌స్టార్ క్రేజ్‌ని సొంతం చేసుకుంటాడు అనటంతో ఎటువంటి సందేహం లేదు. దీపిక పదుకునే పాత్రకు నటించే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి.
ఇకపోతే సినిమాలో అప్పుడప్పుడు మెరుపుల్లా మెరిసే పాత్రలు లెక్కకు మించి ఉన్నాయి.
ఆ పాత్రల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాత్ర అర్జునుడిగా నటించిన విజయ్ దేవరకొండ పాత్ర అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
అలాగే రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, బ్రహ్మానందంలు ఒక్కో సీన్‌లో కనిపించినప్పటికి ప్రేక్షకులకు కునువిందుగా అనిపిస్తుంది.
టెక్నికల్ విభాగం :
‘కల్కి’ సినిమా మొత్తం టెక్నికల్ టీమ్ మాయజాలమే అని చెప్పాలి. అంత స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని మాటలకు చాలా ప్రాధాన్యత ఉంది.
రెండు యుగాలకు సంబంధించిన కథను సినిమాగా తీయలి అనుకున్నప్పుడు ఇతిహాసాల మీద మంచి పట్టు ఉన్న సాయిమాధవ్ బుర్రా అయితేనే కరెక్ట్ అనుకున్నట్లున్నారు దర్శకుడు నాగ్‌అశ్విన్.
అందుకే ఇతిహాసాల పార్ట్‌ను మెయిన్‌గా సాయిమా«దవ్ చేస్తే నాగ్‌అశ్విన్ ఫ్యూచర్ డైలాగ్స్ రాసినట్లుగా ఉంది. మాటలను ఇద్దరు సమపాళ్లలో పంచుకున్నారు.
అలాగే సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. అన్నిటికి మించి ఈ సినిమా ఫైట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంత బాగా ఫైట్స్ కంపోజ్ చేశారు.
దాదాపు 60 శాతం సినిమా గ్రీన్‌మ్యాట్‌లో చేసిన కెమెరామెన్ పనితనంతో ఎక్కడా అది గ్రీన్‌మ్యాట్ అనే ఫీలింగ్ లేకుండా తన వర్క్‌ను నెక్ట్స్ లెవెల్ అన్నట్లుగా చేశారు.
ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంటే ఏంటో ఈ సినిమాలో చేయించారు వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్.
ఆయనతో పాటు తన కుటుంబమంతా ఈ సినిమా కోసం పనిచేసి తండ్రికి తగ్గ కూతుర్లు అనిపించుకున్నారు నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్.
ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌కి మరో రాజమౌళి అని నాగ్ అశ్విన్‌ని ఖచ్చితంగా అంటారు.
ప్లస్ పాయింట్స్ : నటీనటులు
విజువల్ వండర్
ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్
ఫైట్స్, బుజ్జి
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్‌హాఫ్ చాలా స్లోగా ఉండటం
ఫైనల్ వర్డిక్ట్ :
ఖచ్చితంగా చూడాల్సిన విజువల్ వండర్
తెలుగు డైరెక్టర్‌ల సత్తా ఏంటో చూపించారు.
రేటింగ్ : 4/5
శివమల్లాల
Also Read This : 12 ఏళ్ళ గ్యాప్ తరువాత సక్సెస్ మహారాజ