KA Paul as Visakha MP Contestentent:మత ప్రబోధకుడిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఆయన.. మునుగోడు
వంటి మారుమూల నియోజకవర్గంలో పోటీ చేశారు. దేశాధినేతలతో భేటీ అయిన ఆయన.. సాధారణ నాయకుడిగా మారారు..
దాదాపు 15 ఏళ్ల కిందట మొదలైంది ఆయన హంగామా.. ఇప్పటికీ జనంలో కనిపిస్తే చాలు హడావుడి..
పైకి ఎలా అనిపించినా, లోపల మాత్రం ‘లెక్క’ తప్పరు. ఏ అంశంలోనైనా గణాంకాలతో మాట్లాడతారు.
ఐదేళ్ల కిందట ఏపీలో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన.. ఇప్పుడు విశాఖపట్నంపై కన్నేశారు.
వచ్చే ఎన్నికల్లో అక్కడినుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.KA Paul as Visakha MP Contestentent
ఈసారి బరిలో ఎంత హంగామానో?
2019 ఏపీ ఎన్నికల సందర్భంగా మత ప్రచారకుడు కేఎల్ పాల్ చేసిన హంగామా అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. అభ్యర్థిత్వాల ప్రకటన అంటూ హడావుడి చేసి చివరకు తమ
పార్టీ బీఫామ్ లను ఎవరో ఎత్తుకెళ్లారంటూ అసలు పోటీలోనే నిలవలేదు. అటు పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం
నుంచి పాల్ స్వయంగా ఎంపీగా బరిలో దిగారు. కానీ, ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా తెలియదు. కాగా, ఏడాదిన్నర
కిందట తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలోనూ పాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఏపీ ఎన్నికలవైపు
మునుగోడులో పాల్ మామూలుగా సందడి చేయలేదు. ఆయన ప్రాచరం చేసిన తీరు కూడా ప్రజలను నవ్వించింది.
అలాంటి పాల్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా మాత్రం కనిపించలేదు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్టణం
నుంచి బరిలో దిగుతానని తాజాగా ప్రకటించారు. అంతేకాక.. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు దరఖాస్తులు కూడా
ఆహ్వానిస్తున్నారు.
వారి మధ్య పాల్..
విశాఖపట్టణం నుంచి 2019 ఎన్నికల్లో జనసేన తరఫున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, టీడీపీ తరఫున సినీ
నటుడు బాలక్రిష్ణ చిన్న అల్లుడు భరత్ మతుకుమిల్లి, బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బరిలో దిగారు.
వీరిద్దరూ పేరున్న ప్రముఖులే. అయితే, వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ విజేతగా నిలిచారు. ఇప్పుడు టీడీపీ –జనసేన
పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా భరత్ ను నిలిపే చాన్సుంది. జేడీ సొంత పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా? అనేది చూడాలి.
వీరి మధ్యన పాల్ హడావుడి ఎలా ఉంటుందో మరి..?
Also Read:Megastar In Time Square : న్యూయార్క్ టైమ్స్స్క్వేర్పై చిరంజీవికి శుభాకాంక్షలు!