“KA” Sudheer Macharla :
సినిమా పరిశ్రమలో 24 శాఖలు ఉన్నా కూడా.. ఒక సినిమా రివ్యూ గురించి మాట్లాడినప్పుడు కొన్ని శాఖలను మాత్రమే ఉదాహరిస్తాము.
ఏ సినిమా రివ్యూ గురించి మాట్లాడినా హీరో, హీరోయిన్, దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమెరా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటూ ప్రతి రివ్యూలో మెయిన్‌గా వీరిగురించే టాపిక్ ఉంటుంది.
కానీ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా చూసినవారందరూ పైన చెప్పుకున్న వాటి గురించే కాకుండా
రివ్యూలో మొదటివరసలో వినిపించిన పేరు ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ అద్భుతంగా చేశాడు.
( సినిమా చూసినవారికి ఇది అర్ధమవుతుందనుకోండి. . చాలాకాలం తర్వాత ఓ రివ్యూలో ప్రత్యేకంగా అతని గురించి అందరూ మాట్లాడారు.
ఇంతకీ అతనెవరు ? అని వెతికితే …
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నాలుగంటే నాలుగేళ్లు కూడా ఎక్స్‌పీరియన్స్ లేని చిన్న కుర్రాడు. ఆ కుర్రాడిపేరు సుధీర్. గుంటూరు ఘాటుసరుకు మనోడు.
బి.ఆర్క్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) చదువుకుంటున్న సమయంలో వివేక్ అనే ఆర్ట్ డైరెక్టర్ దగ్గరకి యాక్సిడెంటల్‌గా వచ్చి పదిరోజులు పని చేసి కొంత వర్క్ నేర్చుకున్నాడు.
మనదగ్గర ఏమున్నా.. లేకున్నా… చదువు, టాలెంట్ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అనటానికి ఇతనే పెద్ద ఉదాహరణ.
చిత్ర పరిశ్రమలో ఎదగాలి అనుకుంటే మనకి ఎవరో ఒకరు బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి అని అందరూ అనుకుంటారు.
కానీ ఆ మాట అస్సలు నిజం కాదు అని నిరూపించాడు ఈ పాతికేళ్ల కుర్రాడు.
కరోనా నా జీవితానికి వెలుగునిచ్చి దిశా నిర్ధేశం చేయటంతో పాటు కిరణ్ అబ్బవరం అనే ఒక టాలెంటెడ్ హీరోని నాకు ఆత్మబంధువునిచ్చింది అంటాడు.
ఇతనితో మాట్లాడుతుంటే మోటివేషనల్ స్పీకర్‌తోనో, సైకాలజీ క్లాస్‌లోనో ఉన్నట్లుంటుంది. సినిమా అంటే ఇంట్రస్ట్ ఉన్న అందరికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు.
ఇతను చిత్రసీమను ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఏలుతాడు. గుర్తు పెట్టుకొండి.
ఏంటి? ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి ఇంత చెప్తున్నాడు అనుకుంటున్నారా….
ఆ ఆర్ట్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా…?
ఈ ఇంటర్యూ చూడండి. మీకే తెలుస్తుంది.ఇంటర్వూ బై
శివమల్లాల
Also Read This : అనుష్క జన్మదినం సందర్భంగా ప్రత్యేక వీడియో…