యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ‘దేవర’ సీక్వెల్ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘దేవర’ మంచి సక్సెస్ సాధించడంతో ఇటీవల సినిమాను జపాన్‌లోనూ విడుదల చేశారు. ఈ క్రమంలోనే జపాన్‌లో ఎన్టీఆర్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఓ జపాన్ యువతి ఎన్టీఆర్‌తో ‘ఆర్ఆర్ఆర్’ చూశాక తెలుగు నేర్చుకున్నానని చెప్పిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్‌కు ఎన్టీఆర్, కొరటాల శివ వెళ్లారు.
సినిమా ప్రీమియర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ అక్కడి మీడియాతో మాట్లాడుతుండగా.. ఎన్టీఆర్‌కు ‘దేవర 2’పై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు తెలిపాడు. ‘దేవర’ చాలా పెద్ద కథ అని.. పార్ట్ 1 అందులో సగమేనని.. సెకండ్ పార్ట్ అద్భుతంగా ఉంటుదని తెలిపాడు. సెకండ్ పార్ట్‌లో వరతో పాటు అసలు దేవరకు ఏం జరిగిందనే విషయాలను తెలుసుకుంటారని వెల్లడించాడు. ఇప్పటికే దేవర 2కి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైందని.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని వివరించాడు. ఈలోగా తను ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేస్తానని ఎన్టీఆర్ తెలిపాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’తో పాటు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు.
ప్రజావాణి చీదిరాల
Also Read This: 60వ చిత్రాన్ని ప్రకటించేసిన దిల్ రాజు