...

Devara : దేవర రివ్యూ

Devara :

సమీక్ష– దేవర రివ్యూ
విడుదల తేది– 27–09–2024
నటీనటులు–: ఎన్టీఆర్, సైఫ్‌ అలీఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్‌ రాజ్, శ్రుతి మరాఠే, శ్రీకాంత్, మురళీశర్మ, తాళ్లూరి రాజేశ్వరి, కుంచకో బోబన్, అభిమన్యు సింగ్, అజయ్, సనా, హిమజ తదితరులు
దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాత : ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ – యువసుధ ఆర్ట్స్‌
సంగీతం : అనిరుద్‌
సినిమాటోగ్రఫీ : ఆర్‌ రత్నవేలు
ఎడిటర్‌ : అర్‌. శ్రీకర్‌ ప్రసాద్‌

కథ :

సముద్రమంటే భయమే తెలియని రత్నగిరి వాసుల కథ ‘దేవర’. భయమే తెలియనివారికి భయాన్ని పరిచయం చే సి మనుషులు భయంతో బ్రతకటం ఎంతో అవసరం అని చెప్పిన కథ ‘దేవర’.

స్వాతంత్య్రానికి ముందు సముద్రంలో బ్రిటిష్‌వారిని ఎదుర్కొన్న సంతతికి చెందినవారు వారంత.

ఆ రోజుల్లో బ్రిటిష్‌ వారిని గడగడలాడించిన వారి తాతముత్తాతలు దేశం కోసం యుద్ధ వీరుల్లా నిల్చుంటే ఇప్పుడు వీరంతా దేశానికి మచ్చ తీసుకువచ్చే పనులను చేస్తుంటారు.

సముద్రం ఒడ్డున ఉన్న నాలుగు కొండల్లో నాలుగు ఊర్లుగా దిట్టమైన అడవుల్లో ఉంటూ జీవితాన్ని జీవించేవారి జీవితాల్లోకి సడెన్‌గా పోలీసులు ఎంట్రీ ఇస్తారు.

పోలీసాపీసర్‌ అజయ్‌ ఒక ముఠాను వెతుకుతూ ఉండగా వారంతా ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో ఉన్న భైరా (సైఫ్‌ అలీఖాన్‌) పేరు చెప్తారు.

భైరా పోలీస్‌ వారు చెప్పిన పని చేయను అంటూ పోలీసులను వెనక్కి పంపిచేస్తారు. అప్పుడు ఆ ఊరికి పెద్దగా ఉన్న ప్రకాశ్‌రాజు ఆ సముద్రపు కథను పోలీసులకు చెప్తారు.

దేవరగా యన్టీఆర్‌ , భైరాగా సైఫ్‌ అలీఖాన్, శ్రీకాంత్, కలియారసన్‌ నాలుగు ఊర్లకు అధిపతులుగా ఉంటారు.

వారందరి సంప్రదాయం ప్రకారం ఆయుధాలు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు చాలా ఆనందంగా ఉంటుంది అనే నమ్మకంతో బతుకుతుంటారు.

ఆయుధాల కోసం నాలుగు ఊర్ల వారు యుద్ధం చేసి ఎవరు గెలిస్తే వారు ఆ ఆయుధాల్ని ఆ ఏడాది ఆ ఊర్లో ఉంచుతారు.

‘దేవర’ ఎంతో బలవంతుడు కావటంతో ఆ అయుధాలు అన్ని ఎక్కువకాలం దేవర ఊరిలోనే ఉంటూ ఉంటాయి.

అందరి మంచి కోరే దేవర శ్రీకాంత్‌ ఊరుకూడా బావుండాలని సైఫ్‌ని అడిగి ఓ ఏడాది వారికి ఆయుధాలు ఉండే కుర్చీని ఇచ్చేస్తారు. ఆ తర్వాత నుండి వారిలో వారికి గొడవలు జరుగుతాయి.

దేవర నాలుగు ఊర్లకి మంచి జరగాలని ఊరి నుండి ఎవరికి కనిపించకుండా వెళ్లిపోతాడు. అందరి మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి.

అవాంతరాలన్నింటినుండి నాలుగు ఊర్ల వారు బయట పడటానికి దేవర ఏంచేశాడు? ఆ వచ్చిన పోలీసులు ఎవరినైనా పట్టుకున్నారా?

ఆ నాలుగు ఊర్ల వారు సముద్రపు దొంగలుగా ఎందుకు మారారు? దేవర ఎక్కడికి వెళ్లిపోయాడు? దేవర రెండో పార్టులో దర్శకుడు కొరటాల శివ ఏం చెప్తాడు అనే విషయాలు తెలియాలంటే థియేటర్‌లో ఈ సినిమా చూడాలి.

నటీనటుల పనితీరు :

యన్టీఆర్‌ ఒన్‌ మ్యాన్‌ షోలా ఈ సినిమా అంతా ఉంటుంది. దేవర పాత్రలో తండ్రిగా వర పాత్రలో కొడుకుగా తనవరకు అద్భుతంగా నటించారు జూనియర్‌.

జాన్వీకపూర్‌తో చాలా తక్కువ సేపు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నప్పటికి వారిద్దరూ 70యంయం స్క్రీన్‌ని చూపు తిప్పుకోకుండా చేశారనే చెప్పాలి.

ప్రకాశ్‌రాజ్‌ స్టోరీ నేరేషన్‌తో పాటు, సైఫ్‌ అలీఖాన్‌ కొన్ని సీన్స్‌లో ఎంతో బాగా నటించారు. మొదటిఫైట్‌లో యన్టీఆర్, సైఫ్‌ కాంబినేషన్‌ ఫైట్‌ వెరైటీగా డిజైన్‌ చస్త్రవారు దర్శకుడు కొరటాల.

శ్రీకాంత్‌ తన నటన పరిధిమేరకు ఓకే అనిపించారు. మిగతా వారంతా తమ తమ పాత్రల్లో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు.

టెక్నికల్‌ విభాగం :

ఈ సినిమాకి ఆయువుపట్టు టెక్నికల్‌ టీమ్‌ అని చెప్పాలి. ముఖ్యంగా కెమెరామెన్‌ రత్నవేల్‌ కెమెరాతో మ్యాజిక్‌ చేశారు.

ఫైట్‌ సీక్వెన్స్, నైట్‌ ఎఫక్ట్స్‌లో తనపని చూపించి ప్రేక్షకులని మంతముగ్ధుల్ని చేశాడు. అనిరు«ద్‌ తన సంగీతంతో ఓహో అనిపంచకపోయినా ఓకే అనిపించాడు.

ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ దర్శకుడు కొరటాలకు అడ్డు చెప్పయినా సరే తన కత్తెరకి పనిచెప్పి కొన్ని సీన్లు రిమూవ్‌ చేస్తే బావుండేదేమో అనిపించింది.

వీఎఫ్‌ఎక్స్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంత బాగా వీఎఫ్‌క్స్‌ని రూపొందించిన యుగంధర్‌ అండ్‌ టీమ్‌కి ప్రేక్షకులు క్లాప్స్‌ కొట్టాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్‌ :

యన్టీఆర్‌ నటన
చుట్టమల్లే సాంగ్‌
కెమెరా వర్క్, వీఎఫ్‌ఎక్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

లెంగ్త్‌ అఫ్‌ ది మూవి
సముద్రంలోని కొన్ని రిపీటెడ్‌ సీన్స్‌
స్లో పేస్‌

ఫైనల్‌ వర్డిక్ట్‌ :

విత్‌ అవుట్‌ హై ఎక్‌సపెక్టేషన్స్‌ హ్యాపీగా చూడొచ్చు

రేటింగ్‌ : 3/5
     శివమల్లాల

Also Read This : చిరంజీవికి గిన్నిస్‌లో స్థానం…

Devara Review
Devara Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.