అమెరికాలో 2001లో దర్శకుడు దేవా కట్టాకు ఆడిషన్ ఇస్తే 2005లో పిలుపొచ్చింది ఈ నటునికి.
ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్ సెలబ్రిటీలకు సిమ్కార్డ్స్ అమ్మే వ్యక్తి సినిమాపై మక్కువతో అమెరికాకు ఎందుకు వెళ్లాడు?
అక్కడ ఆడిషన్స్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగాడు? ఇంతకి ఎవరితను…
అతనే ‘వెన్నెల’ చిత్రంతో ఎంతోమంది నటీనటులకు బ్రేక్ దొరికింది.
వెన్నెల కిశోర్, శర్వానంద్, రాజా, పార్వతి మిల్టన్. ఆ టీమ్‌లో వచ్చిన నటుల్లో రవివర్మ కూడా ఒకడు.
తన టాలెంట్‌తో పెద్ద హీరోల సినిమాల్లో అనేక ఇంపార్టెంట్ రోల్స్ సంపాదించుకుని గుడ్ పెర్ఫార్మర్గా మార్కులు కొట్టేసి
యన్టీఆర్, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్‌లతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకావం దక్కించుకున్నారు రవి.
‘రాఖీ’ చిత్రంలో యన్టీఆర్ కాళ్లు పట్టుకునే సీన్ దగ్గర ఎలా ర్యాగింగ్ చేశారు?
మహేశ్‌బాబు తనను ఎలా ఆట పట్టిస్తాడో చెప్పారు.
అనుకోకుండా రెస్టారెంట్లో ఉంటే అల్లుఅర్జున్ ‘హ్యాప్పీడేస్’ సినిమాకి వెళ్దాం పద అనగానే ఇద్దరే వెళ్లి సినిమా చూశారట!
వైయస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతంతో తెరకెక్కిన చిత్రం ‘హత్య’. ప్రస్తుతం రవివర్మ వైయస్ వివేకాలా నటించారు.
‘హత్య’ సినిమా విడుదలై తనకు, తాను చేసిన పాత్రకు మంచి పేరు రావటంతో ఎంతో ఆనందంగా ఉంది అంటున్నారు రవి.
ఇలాంటి మరెన్నో విషయాలను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌తో షేర్ చేసుకున్నారు నటుడు రవివర్మ. మీరు ఓ లుక్కేయండి…ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : వైఎస్ వివేకాని చంపించింది కూతురు అల్లుడేనా ?
