విజయ్ దళపతి ప్రధాన పాత్రలో ‘జయ నాయగన్’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ‘జయ నాయగన్’ ఆయన చివరి చిత్రంగా రూపొందుతోందని టాక్. దీంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాను విజయ్ తన పొలిటికల్ కెరీర్‌కు కూడా ఉపయోగపడేలా తీస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ గురించి ఒక సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశానికి సంబంధించిన హక్కులను తన సినిమా కోసం విజయ్ సినిమా మేకర్స్ కొనేశారట. ‘జయనాయగన్’లో ఈ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తున్నారట. ఇక ఒక్క సీన్‌ను మాత్రమే రీమేక్ చేశారని తెలుస్తోంది. మిగిలిన సినిమా మొత్తం ‘భగవంత్ కేసరి’తో ఏమాత్రం సంబంధం ఉండదట. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం ఈ ఒక్క సీన్ కోసం మేకర్స్ రూ.4 కోట్లు చెల్లించారని సమాచారం. ఈ సీన్ మహిళలకు బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ భావిస్తున్నాడట.