సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి అయితే ఆవిష్కరిస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని జక్కన్న అనువదించనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జక్కన్న ఒక్కో సన్నివేశాన్ని అద్భుతంగా మలుస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మహేశ్‌తో తాజాగా ఓ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేశారని సమాచారం. ఈ సన్నివేశం మహేశ్ కెరీర్లోనే ది బెస్ట్ కానుందట. మరి ఈ యాక్షన్ సీన్ స్పెషాలిటీ ఏంటంటారా? అదంటా అయితే తెలియదు కానీ మహేశ్ బాబు మాత్రం షర్ట్ తీసేసి మరీ ఫైట్ చేశాడట. ఇప్పటి వరకూ మహేశ్ ఏ సినిమాలోనూ ఇలా చొక్కా విప్పి ఫైట్ చేసిందైతే లేదు. దీంతో ఇది మహేశ్ కెరీర్లోనే తొలిసారి కానుంది. అలాగే ఈ ఫైట్ ఆయన కెరీర్లోనే ది బెస్ట్ కానుందని సమాచారం. ఇప్పటికే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను జక్కన్న పూర్తి చేసేశారట. మొత్తానికి ఈ ఫైట్ సీన్ మాత్రం సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.
ప్రజావాణి చీదిరాల