ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ‘జాక్’..

సిద్దూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘జాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలై నెల కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 8న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. పాబ్లో నెరుడా అలియాస్ జాక్ అనే వ్యక్తి తన జీవితంలో ఏం చేసినా ఫన్ ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే దేశాన్ని రక్షించుకోవడంలో ఒక అడుగు ముందుండాలని భావిస్తాడు. దీనికోసం ‘రా’ విభాగంలో చేరాలని అనుకుంటాడు. అయితే దీనిలో చేరడానికి ముందే ‘ఆపరేషన్ బటర్ ఫ్లై’ మొదలు పెడతాడు. ఆ తరువాత జరిగే పరిణామాలేంటి? సినిమా ఎలాంటి మలుపులు తీసుకుంది? వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా థియేటర్‌‌లో అయితే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *