మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
ఉగాది సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సినిమా పట్టాలెక్కకముందే ప్రమోషన్స్ కూడా చేపట్టింది.
వాస్తవానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి వెరైటీ కాన్సెప్ట్ బేస్డ్ ప్రమోషన్స్‌చేసి అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు ఇదే ఫార్ములాను చిరుతో చేయబోయే సినిమాకు సైతం అప్లై చేస్తున్నారు.
సినిమాకు పనిచేయబోయే వారందరినీ తనతో సహా ఒక కాన్సెప్ట్ ద్వారా అనిల్ రావిపూడి ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా నటించనున్నారట. అతిథి పాత్రే అయినా బాగా వెయిట్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది.
చిరు చిత్రంలో వెంకటేష్ కూడా నటిస్తే ఇక సినిమాకు తిరుగుండదని.. సినిమా రేంజ్ బీభత్సంగా పెరుగుతుందని అంటున్నారు.చూడాలి మరి.
ఈ వార్తల్లో నిజమెంత అనేది. వచ్చే సంక్రాంతికి రఫ్పాడిద్దాం అని చిరంజీవితో ఓపెనింగ్ రోజే చెప్పించటం విశేషం…
కొసమెరుపేమిటంటే సక్సెస్‌ఫుల్ దర్శకుడు కాబట్టి అనిల్ రావిపూడి ఏం చెప్పినా చేస్తున్నారు.
అదే వేరే దర్శకులు చెప్తే మన నటీనటులు, టెక్నీషియన్లు ఎవరి మాటైనా వింటారా? అని ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్నే…
ఏదేమైనా సక్సెస్ టాలెంట్ ఉన్న దర్శకుడు మంచి స్పీడ్‌లో ఉంటే ఎలా ఉంటుందో అనిల్‌ను చూసి నేర్చుకోవాలి అని ఫిలింనగరంతా కోడై కూస్తుంది. నిజం కాదంటారా…..
ప్రజావాణి చీదిరాల
Also Read This : స్పెషల్ స్టోరీ ఎబౌట్ టాలీవుడ్ హీరోయిన్ డాక్టర్స్….