IPS Kothakota Srinivasa Reddy:‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ, చంటి గాడు లోకల్’.. పూరి
జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.
సినిమా రిలీజై 22 ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ ఈ డైలాగ్ చాలామంది నోళ్లలో నానుతూ ఉంటుంది.
ఇప్పుడీ డైలాగ్ ను కాస్త మార్చి చెప్పుకోవాలి.. ‘‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ పోతూ ఉంటారు.. కానీ, ఈయన మాత్రం స్పెషల్’’ అనుకోవాలి.
ఔను మరి..హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అంటే అంతే మరి..
మహా స్ట్రిక్టు..
వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్.. ఇలా ఎక్కడ పనిచేసినా ఐపీఎస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అంటే మహా స్ట్రిక్టు అనే అంటారు.
ఎందుకంటే.. వరంగల్ లో రౌడీ నాయకులను ఒక్క తన్నుతన్నినా.. మహబూబ్ నగర్ లో మావోయిస్టులను మట్టుబెట్టినా..
హైదరాబాద్ లో తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది 86 మందినీ ఒక్కసారిగా బదిలీ చేసినా కొత్తకోట శ్రీనివాసరెడ్డి రూటే వేరు.
ఒకప్పుడు దేశంలో రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా కితాబులందుకున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ విషయంలో చర్యలు తీసుకోవడానికి
ఎంతటి అధికారైనా సంకోచిస్తారు. కానీ, శ్రీనివాసరెడ్డి మాత్రం అదేమీ చూడలేదు. ఒకే ఒక సంతకంతో సిబ్బందిని బదిలీ చేసేశారు.
కాగా, మహబూబ్ నగర్ లో 2005-07 మధ్య నక్సలిజం అత్యంత తీవ్రంగా ఉంది. మాజీ మంత్రి డీకే అరుణ తండ్రి, మక్తల్ ఎమ్మెల్యే
చిట్టెం నర్సిరెడ్డి, ఆయన చిన్న కుమారుడిని మావోయిస్టులు కాల్చిచంపారు. ఈ దారుణం 2005 ఆగస్టు 15న జరిగింది.
అనంతరం అక్కడి ఎస్పీని బదిలీ చేసి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈయన హయాంలోనే మావోయిస్టు రాష్ట్ర
కార్యదర్శి సాంబశివుడు ఎన్ కౌంటర్ అయ్యారు. ఇంకా పదుల సంఖ్యలో మావోయిస్టులు కూడా హతమయ్యారు.
ఆరోపణలన్నిటికీ సమాధానం
ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైంది పంజాగుట్ట ఠాణా. డిసెంబరు 23న రాత్రి ప్రజాభవన్ ఎదుట కారుతో బ్యారీకేడ్లను
ఢీకొన్న ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించినట్లుగా పంజాగుట్ట ఇన్
స్పెక్టర్ దుర్గారావు పై ఆరోపణలు రాగా.. ఆయనను సస్పెండ్ చేశారు. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన
అభియోగాలపై బోధన్ మాజీ ఇన్‌స్పెక్టర్ ఇటీవలే అరెస్టయ్యారు. జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసుకుని తప్పించుకుని
తిరిగుతున్న ఘరానా నిందితుడు అమీర్ అలీని పంజాగుట్ట పోలీసులు జనవరి 26న పట్టుకున్నారు. వైద్య పరీక్షలకు గాంధీ
ఆస్పత్రికి తరలించగా.. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని, పారిపోయాడు. గత ఏడాది జనవరి 31న పెట్రోకార్-2 సిబ్బంది
ఎర్రమంజిల్‌లోని రహదారులు-భవనాల శాఖ కార్యాలయం ఆవరణలో విధినిర్వహణలో మద్యం సేవిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు.
సబ్ ఇన్‌స్పెక్టర్లు, కొందరు కానిస్టేబుళ్లు సుదీర్ఘకాలంగా పాతుకుపోయారనే ఆరోపణలు తరచూ వస్తున్నాయి. ఇవేకాదు.. అడపాదడపా
ఈ స్టేషన్ సిబ్బందిపై డీసీపీ, సీపీలకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో సీపీ శ్రీనివాసరెడ్డి ఏం జరుగుతోందో చూడమంటూ నిఘా వర్గాలను
ఆదేశించారు. ఇంటెలిజెన్స్ పక్కా నివేదికతో ఒకేసారి పెద్దమొత్తంలో అధికారులు, సిబ్బందిని ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) విభాగానికి అటాచ్ చేసినట్లు
తెలిసింది.
146 మంది కొత్త సిబ్బంది
ఠాణా మొత్తాన్ని ప్రక్షాళన చేసిన పోలీసు కమిషనర్.. ఆ వెంటనే 146 మంది సిబ్బందికి పంజాగుట్టలో పోస్టింగ్ ఇచ్చారు.
వీరిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు ఎస్సైలు, 8 మంది ఏఎస్సైలు, 18 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 70 మంది కానిస్టేబుళ్లు, 34 మంది
హోంగార్డులు, ముగ్గురు ఎస్పీవోలు, నలుగురు ఎల్జీఈలు ఉన్నారు. కాగా, ఇన్స్‌పెక్టర్ నుంచి హోంగార్డు వరకూ అందరినీ బదిలీ చేస్తూ
కమిషనర్ తీసుకున్న నిర్ణయం పోలీసు శాఖలో తొలిసారి అని చెబుతున్నారు. ఏది ఏమైనా తాను సాధారణ కమిషనర్ కాదని.. కొత్తకోట
శ్రీనివాసరెడ్డి చాటారు.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?