Bandi :
పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ లో ఐపీఎల్ తరహాలోనే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోందన్నారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం 400 స్థానాలతో హ్యాట్రిక్ కొట్టనుందని, ఇండియా కూటమిని ఎన్డీఏ టీమ్ చిత్తుగా ఓడిస్తుందని అన్నారు. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ ఐపీఎల్ ఆట మొదలైందని చెప్పారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో 17 మంది సభ్యుల బీజేపీ జట్టు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంట నక్కల్ని ఓడించడం తథ్యమని వ్యాఖ్యానించారు. చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని, అయినా ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ (తెలంగాణ ప్రీమియర్ లీగ్) కప్ ను గెలిచి, ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. అతి తక్కువ వ్యవధిలో కాంగ్రెస్ అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీగా నిలిచిందని బండి సంజయ్ ఆరోపించారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా కొనడం లేదని, తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.
ఇక టీపీఎల్ లో కిషన్ రెడ్డి టీంలో ఆటగాళ్ల జాబితాను కూడా బండి సంజయ్ ప్రకటించారు. ఆయన తెలిపిన దాని ప్రకారం జట్టు సభ్యులుగా బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాధవీలత, గోమాస శ్రీనివాస్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీబీ పాటిల్, శానంపూడి సైదిరెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్, బూర నర్సయ్యగౌడ్, గోడెం నగేశ్, పోతుగంటి భరత్ సహా 17 మంది సభ్యులం ఉన్నామన్నారు. మరోవైపు కాంగ్రెస్ కు ఇంకా ఆటగాళ్లే దొరకడం లేదని, బీఆర్ఎస్ కు టీమ్ సభ్యులున్నా నిరాశలో ఉన్నారని బండి సంజయ్ విశ్లేషించారు.
Also Read This Article : జిమ్ చేయడం వల్ల గుండెపోటు వస్తుందా?
Also Read This Article : ఫోన్ ట్యాపింగ్ అందరూ చేసేదే?