లక్నో వేదికగా సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చెన్నై, లక్నో జట్ల మధ్య జరిగింది. పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన చెన్నై జట్టు తొలుత బౌలింగ్ చేసి లక్నో జట్టును 166 పరుగులకే కట్టడి చేసింది. వరుసగా 5 అపజయాలు నమోదు చేసిన తర్వాత విజయం సాధించిన చెన్నై జట్టుకు కొంతలో కొంత ఊరట లభించింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఒక సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అటువంటి సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన ఎంఎస్ ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్న శివమ్ దూబే (43 పరుగులు )కు సహకరించటంతో చెన్నై విజయం సాధించింది. సీనియర్స్ ఇద్దరు వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడారు కాబట్టి చెన్నై మ్యాచ్ ను గెలిచింది. లేదంటే మరో ఓటమిని రుచి చూసేది. లక్నో జట్టులో కెప్టెన్ రిషబ్ పంత్ 49 బంతుల్లో 63 పరుగులు చేసి హైయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.
శివ మల్లాల
Also Read This : గత ఫీలింగ్‌ను తిరిగి ఇవ్వాలనే ట్రైలర్‌ను ముందుగా విడుదల చేశాం