India Alliance News: బిహార్ లో సజావుగా సాగుతున్న కాంగ్రెస్-జేడీయూ-ఆర్జేడీ కూటమిని విడగొట్టారు..
జార్ఖండ్ లో విజయవంతంగా నడుస్తున్న జేఎంఎం-కాంగ్రెస్ కూటమిలో కలకలం రేపారు..
ఇక విపక్షాలు లేదా విపక్ష నాయకుడు బలంగా ఉన్నది ఎక్కడంటే.. ఢిల్లీలోనే.
అక్కడి సీఎం, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ చాన్నాళ్లుగా మోదీకి కొరకరాని కొయ్య.
ఆయన్ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు నెరవేరలేదు.
అయితే, కేజ్రీ కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఇండియా కూటమిలో చేరారు.
వచ్చే ఎన్నికలకు విపక్షాల తరఫున ఆయన బలమైన గళం అవుతారు. దీంతోనే మోదీ ప్రభుత్వం కేజ్రీని టార్గెట్ చేసింది.
మద్యం కుంభకోణం మెడకు చుట్టి..India Alliance News
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పదేళ్ల పాలనలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణ ఏదైనా ఉందంటే..
అది ఢిల్లీ మద్యం విధానం కుంభకోణమే. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టయ్యారు.
బీజేపీ తదుపరి టార్గెట్ కేజ్రీవాలే. అందుకే ఆయనకు నోటీసుల మీద నోటీసులు పంపుతోంది.
ఐదుసార్లు సమన్లు అందజేసినా కేజ్రీ మాత్రం చెక్కుచెదరడం లేదు. శుక్రవారం కూడా ఈడీ విచారణకు వెళ్లలేదు.
అరెస్టు చేసేందుకే..India Alliance News
మద్యం కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపిస్తున్న ఈడీ..
కేజ్రీని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.
శుక్రవారం కూడా కేజ్రీ ఈడీ విచారణకు వెళ్లలేదని ఓ ప్రకటనలో పేర్కొంది.
చట్టబద్ధమైన సమన్లకు కట్టుబడి ఉంటామని పేర్కొంటూనే..
కేజ్రీని అరెస్టు చేయడం, దిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాని మోదీ లక్ష్యంగా ఆరోపించడం గమనార్హం.
హేమంత్ లాగానే కేజ్రీనీ..?
కేజ్రీవాల్ తరహాలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూ ఈడీ పదేపదే నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
వాటికి ఆయన సమాధానం ఇవ్వలేదు. చివరకు ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా వైదొలగారు.
ఓ దశలో 30 గంటల పాటు మిస్సింగ్ అయ్యారు కూడా. తిరిగి వచ్చాక పదవిని వదులుకున్నారు.
అయితే, సోరెన్ గాయబ్ అయిన సమయంలో కేజ్రీ దగ్గరకే వెళ్లారని బీజేపీ ఆరోపణలు చేయడం గమనార్హం.
చివరకు చూస్తున్నదేమంటే.. సోరెన్ తరహాలోనే కేజ్రీనీ ఈడీ ముగింటకు తెచ్చేందుకు ప్రయత్నం చేయడం ఖాయం.
ఇప్పటికైతే మోదీ ప్రధాన టార్గెట్ అతడే. ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?
India Alliance News: మోదీ తదుపరి వంతు ఆ సీఎందేనా?