ప్రభాస్ ‘రాజాసాబ్’ గురించి కీలక అప్‌డేట్..

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్, కామెడీ మూవీలో నటించి చాలా కాలం అవుతోంది. దీనికి హారర్ కూడా తోడవడం ఈ సినిమా స్పెషాలిటి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా కనిపించనుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సన్నివేశమే సినిమాకు కీలకంగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఒక పాటను చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ పాటలో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ కూడా కనిపించనుందని టాక్. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే పలు మార్లు సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సినిమా జాప్యం లేకుండా మారుతి పూర్తి చేస్తున్నారు. మొత్తానికి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ అయితే ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *