సినిమా చేయడం ఒక ఎత్తైతే.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. దీనిని అందరూ చేయలేరు. ఇలాంటి వాటిలో నేచురల్ స్టార్ నాని దిట్ట అని చెప్పాలి. తన సినిమా ఏదైనా చాలా స్ట్రాటజికల్‌గా ముందుకు తీసుకెళతాడు. ‘హిట్ 3’ సినిమాను ఫణంగా పెట్టి ‘కోర్టు’ సినిమాకు అద్భుతంగా ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు ‘హిట్ 3’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రమోషన్స్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసిన నాని ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పి హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పాడు. అంతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పాడు కాబట్టి కావల్సినంత హైప్ వస్తోంది. ఇంతకూ నానికి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? లెజెండరీ నటి శ్రీదేవి.
తనకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమని.. ఆమెను ఆరాధించానని సదరు ఇంటర్వ్యూలో నాని చెప్పుకొచ్చాడు. శ్రీదేవి నటించిన ‘క్షణ క్షణం’ సినిమాను లక్షల సార్లు చూశానని చెప్పుకొచ్చాడు. అసలు ఆమె అంత అందంగా ఎలా ఉన్నారో తనకు ఇప్పటికీ అర్థం కాదని.. ఆ సినిమాకే శ్రీదేవి అందం తీసుకొచ్చారని పేర్కొన్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి నానిని ఒక ఆసక్తికర విషయం అడగ్గా.. అంతే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘హిట్ 3’, అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్ 2’ ఒకే రోజు విడుదలవుతున్నాయి కదా.. పోటీ తప్పదా అని ప్రశ్నించారు. దీనికి నాని.. ‘రైడ్ 2’కు ప్రాధాన్యమివ్వాలని.. అజయ్ సర్‌తో తనకసలు పోటీయే లేదని చెప్పుకొచ్చాడు. ఎవరైనా అయితే దేని ప్రయారిటీ దానిదే అని చెప్పేవారు. నాని చెప్పిన సమాధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి నాని ‘హిట్ 3’ ప్రమోషన్స్‌ను హీటెక్కిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
ప్రజావాణి చీదిరాల