ప్రస్తుతం కొందరు ముద్దుగుమ్మలకు సోషల్ మీడియానే అవకాశాలు కల్పించే అద్భుతమైన ఫ్లాట్‌ఫామ్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా టాలీవుడ్ నటి కల్పికా గణేశ్ వార్తల్లో నిలిచింది. దీని కారణం.. తాజాగా జరిగిన ఓ ఘటనే. ఈ ముద్దుగుమ్మ తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్‌లోని పబ్‌లో సెలబ్రేట్ చేసుకుంది. కానీ పుట్టినరోజు కేక్ విషయమై పబ్ నిర్వాహకులతో గొడవపడి రచ్చ రచ్చ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమే ఇన్‌స్టాలో షేర్ చేసింది. దానిని చూసిన నెటిజన్లు కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపడేస్తున్నారు.
పైగా బిగ్‌బాస్‌లో అవకాశం సంపాదించుకోవడం కోసమే ఇదంతా చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. దీనిపై తాజాగా కల్పిక స్పందించింది. పబ్లిసిటీ స్టంట్ కోసం చేయలేదని తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌లో వాళ్లే తనను చూడాలనుకుంటున్నారేమోనంటూ చెప్పుకొచ్చింది. తనకు మందు తాగే అలవాటుందని.. కానీ పుట్టినరోజు వేడుకలో మాత్రం మందు తాగనేదని చెప్పుకొచ్చింది. తాను మందు తాగుతానని తన స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ తెలుసని వెల్లడించింది. తను మందు తాగి దాదాపు మూడు నెలలవుతోందని తెలిపింది. తన పుట్టినరోజు నాడు కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగానని తెలిపింది. ఇక కల్పిక సినిమాల విషయానికి వస్తే.. ‘ఆరెంజ్, జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు తదితర చిత్రాల్లో నటించింది.