అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబో లో సినిమా వస్తుంది అంటేనే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అందరూ ఫిక్స్ అయిపోతారు.
అలాంటిది “సంక్రాంతికి వస్తున్నాం” అంటూ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సారి సంక్రాంతికి రాబోతుంది.
మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో ఈ చిత్రం జనవరి 14 న ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అయిపోయింది.
ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అయితే ఒక రేంజ్ లో చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు.
మీనాక్షి మాట్లాడుతూ : ”ఫస్ట్ టైం కామెడీ జోనర్ ట్రై చేశాను. ఇందులో కామెడీ స్పేస్ లో కాప్ రోల్ ప్లే చేయడం చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.
నన్ను కాప్ రోల్ చూడటం ఆడియన్స్ కి కూడా ఓ కొత్త ఎక్స్పీరియన్స్.
ఫస్ట్ టైం ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా వుంది.కాప్ రోల్ చేయాలనేది నా డ్రీం.లక్కీగా నా కెరీర్ బిగినింగ్ లోనే రావడం సంతోషంగా వుంది.
వెంకటేష్ గారితో వర్క్ చేయడం సూపర్ ఎక్స్ పీరియన్స్. ఆయన వండర్ ఫుల్ హ్యూమన్.
ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం.ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ చేశారు పెద్ద స్టార్ తో వర్క్ చేస్తున్న ఫీలింగ్ లేదు.
ఆన్ సెట్స్ ఆఫ్ సెట్స్ చాలా ఫన్నీ గా ఉంటారు. నా లైఫ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్.
ఐశ్వర్య నటించిన చాలా సినిమాలు చూశాను. ఒక ఫ్యాన్ మూమెంట్ లా అనిపించింది, తను చాలా పాజిటివ్ గా వుంటారు. తనతో కలసి పని చేయడం హ్యాపీగా అనిపించింది.
తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.ఈ సినిమా ప్రమోషన్స్ కి నా దగ్గర టైం వుంది. కొత్త కొత్త ఐడియాలతో సినిమాని ప్రమోట్ చేస్తున్నాం.
వెంకీ మామ క్యారెక్టర్స్ తో స్కిట్ చేయడం చాలా ఫన్ ఎక్స్పీరియన్స్.
అలానే అన్ స్టాపబుల్ లో బాలయ్య గారిని కలవడం హ్యాపీగా అనిపించింది, బాలయ్య గారు..
వన్ అండ్ ఓన్లీ ఓజీ.ఎపుడూ యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటారు.” అని చెప్పారు
సంజు పిల్లలమర్రి
Also read this : అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చిన హై కోర్టు