యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ‘వార్ 2’తో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ‘దేవర’ సినిమా విడుదలైన వెంటనే ‘వార్ 2’ షూటింగ్‌లో తారక్ బిజీ అయిపోయాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ అయితే ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్‌తో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. తాజాగా ‘వార్ 2’ సినిమాతో పాటు ఎన్టీఆర్‌పై హృతిక్ రోషన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ‘వార్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా అయితే ఎలాంటి కష్టం లేకుండా సునాయాసంగా పూర్తైందని.. దీనికి సంబంధించి ప్రతి షెడ్యూల్‌ను ఫర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసినట్టు వివరించారు. ఇదంతా దర్శక నిర్మాతల వల్లే సాధ్యమైందని వెల్లడించాడు. ఇక ఎన్టీఆర్ గురించి హృతిక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. సెట్స్‌లో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్‌గానూ.. సరదాగానూ ఉంటాడని వెల్లడించాడు. ఎన్టీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని హృతిక్ తెలిపాడు. ఎన్టీఆర్ గురించి హృతిక్ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తాయి.
ప్రజావాణి చీదిరాల