HMDA Siva Balakrishna :
శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు…
ఐదేళ్ల కిందట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా వచ్చింది గుర్తుందా..? ‘‘అరవింద సమేత వీర రాఘవ’’ అంటూ తారక్ ను భిన్నంగా చూపుతూ త్రివిక్రమ్ తీసిన ఆ సినిమా క్లాసిక్ గా నిలిచింది. ఎందుకనో ఈ స్టోరీ రాసేటప్పుడు ఈ కథనమే గుర్తొచ్చింది.. కాకపోతే ఈ సినిమాకు దానికి సంబంధమే లేదు. సాఫ్ట్ గా హీరోయిజాన్ని చూపిన అరవింద సమేత సినిమా. అరవింద సమేతలోలాగానే హైదరాబాద్ లో ఓ ఇద్దరు ఉన్నతాధికారులు ఇంతే సాఫ్ట్ గా వందల కోట్లు కాజేశారు.
తెలుగు రాష్ట్రాల అధికార, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు..? అదే రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ గా ఉన్నత పదవులు అనుభవించిన ఈయన అక్రమాస్తులు రూ.500 కోట్లకు పైనే అని కథనాలు వస్తున్నాయి. అలాంటి శివబాలకృష్ణ ఇటీవల ఏసీబీకి దొరికారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే ఈడీ కూడా దీనిపై ఫోకస్ చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శివబాలకృష్ణ ఏసీబీ విచారణ సందర్భంగా ఓ ఐఏఎస్ పేరును ప్రస్తావించారు. హెచ్ఎండీఏలో అత్యంత కీలక పదవిలో పనిచేసిన ఆ అధికారి శివబాలకృష్ణ ద్వారానే తనకు కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో తెలంగాణలో ఎవరా ఐఏఎస్ అనే చర్చ జరుగుతోంది. అత్యంత విలువైన నార్సింగి ప్రాంతంలో ఉన్న ఓ వివాదాస్పద భూమికి సంబంధించి శివబాలకృష్ణ నిబంధనలను అడ్డగోలుగా అతిక్రమించి అనుమతులు ఇచ్చారు. దీనిని కలెక్టర్ ఆదేశాలతోనే చేసినట్లుగా స్పష్టమైంది.
ఐఏఎస్ డిమాండ్.. శివబాలకృష్ణ ఇచ్చేశారు..
శివబాలకృష్ణ అక్రమాల వెనుక ఆ ఐఏఎస్ ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆఖరికి నార్సింగిలోని ఓ ప్రాజెక్టు అనుమతి కోసం ఐఏఎస్ ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్లగా తేలింది. ఐఏఎస్ అడిగినదాంట్లో స్థిరాస్తి వ్యాపారి మొదటగా రూ.కోటి చెల్లించాడు. అది కూడా తెలంగాణ ఎన్నికలు జరిగిన డిసెంబరులోనే కావడం గమనార్హం. ఈ పెద్దమొత్తం డబ్బును శివ బాలకృష్ణ ద్వారా అధికారికి చేరాయి. ఈ విషయాన్ని అతడు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నాడు. ఈ విషయాలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తునకు నిర్ణయించారు.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…