అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చిన హై కోర్టు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‏కు ఉపశమనం లభించింది.

ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు.

రూ. 50 వేలు, అలాగే రెండు పూచికత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది.

డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఆమె మృతికి అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

అదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.

రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణమంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బన్నీ రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. బన్నీకి బెయిల్ ఇస్తే పోలీస్ విచారణకు సహకరించరని..

ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ పీపీ వాదనలు వినిపించారు.

మరోవైపు సంధ్య థియేటర్ ఘటనకు, బన్నీకి ఎలాంటి సంబంధం లేదని వాదనలు వినిపించారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి.

BNS సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదని.

రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు ఏమాత్రం వర్తించదని అన్నారు.

ఇక తాజాగా విచారణ అనంతరం అల్లు అర్జున్ కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.

మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు.

అదే రోజు అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శుక్రవారం బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

సంజు పిల్లలమర్రి

Also Read This : ఘటోత్కచుడు కొడుకు భార్బరిక్ ఆ…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *