హీరో, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విజయ్ ఆంటోనీ ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘మార్గాన్’ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే విజయ్ ఆంటోనీ, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, నటి దీప్సిక, నటుడు అజయ్ తదితరులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈ క్రమంలోనే సినిమాలోని ఒక పాట పాడి అలరించారు. పైగా యాంకర్‌తో కలిసి తన చిత్రంలోని పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
గతంలో కంటే భిన్నంగా ప్రమోషన్స్‌ను నిర్వహించారు. చక్కగా యాంకర్‌తో కలిసి స్టెప్పులేసి ప్రమోషన్స్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లే యత్నం చేశారు. అయితే తనకు తెలుగు రాదని.. అందుకే డ్యాన్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతున్నట్టు విజయ్ ఆంటోనీ తెలిపారు. ఇక మార్గాన్ చిత్రం తమిళంలో కంటే తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని విజయ్ ఆంటోనీ తెలిపారు. ఈ సినిమాకు తాను సంగీత దర్శకుడిగానే వర్క్ చేసినట్లు చెప్పారు. తన దర్శకత్వంలో ‘బిచ్చగాడు 3’ రానుందని విజయ్ ఆంటోని తెలిపాడు.
ప్రజావాణి చీదిరాల