‘కరప్పు’ టైటిల్‌తో రాబోతున్న సూర్య

స్టార్ హీరో సూర్య హిట్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. తాజాగా కోలీవుడ్ హాస్య నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు ‘కరప్పు’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను సూర్య షేర్ చేయడమే కాకుండా దర్శకుడు ఆర్జే బాలాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీం అందిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దాదాపు ఏడాదికి పైగా స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసినట్లు తెలిపింది. ఆర్జే బాలాజీ రేడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత కమెడియన్‌గా వెండితెరపై నటుడిగా, గాయకుడిగా. ఇక దర్శకుడిగానూ మారి పలు చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. తొలి చిత్రాన్నేనయనతారతో తీశారు. ఆమెతో ‘అమ్మోరు తల్లి’ అనే చిత్రాన్ని తీసి హిట్ కొట్టారు. ఆ తరువాత సత్యరాజ్‌తో సినిమా తీశారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హీరో సూర్యతో మూవీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *