ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని #RAPO22తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మహేష్ బాబు. పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ (గురువారం) రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ఆసక్తికర గ్లింప్స్‌తో రిలీజ్ చేశారు.
2000 ప్రారంభంలో సెట్ అయిన ఈ క్లిప్ హౌస్ ఫుల్ థియేటర్ వెలుపల అభిమానుల సందడితో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో థియేటర్ యజమాని, ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ లేటెస్ట్ సినిమాకు టికెట్ల కోసం వచ్చే కాల్స్‌తో బిజీగా ఉంటారు. తొలుత వీఐపీ రిఫరెన్స్ ఉన్నవారికి టికెట్లను కేటాయిస్తారు. అయినా సరే.. కాల్స్ వస్తూనే ఉంటాయి. చివరకు విసిగిపోయిన సూర్య కుమార్ ఫోన్‌ను పక్కన పెడతారు.అప్పుడే రామ్ ఎంట్రీ. ‘ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్’ పేరిట 50 టికెట్లు అడగటంతో మారు మాట్లాడకుండా థియేరట్ యజమాని ఇస్తాడు. ఫ్యాన్స్‌తో సంబరాలు.. భారీ కటౌట్ ముందు ఫోజ్.. పేలుతున్న పటాకుల నడుమ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. అభిమాని పాత్రలో రామ్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రజాావాణి చీదిరాల