డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వంలో హీరోయిన్ వెధిక ప్రధాన పాత్రలో నటించిన “ఫియర్” చిత్రం ప్రేక్షకులను ముందుకు రానుంది .
ఈ చిత్రాన్ని డాక్టర్ వంకి పెంచలయ్య మరియు ఆర్. అభి దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు, సుజాత రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు.
ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.
హరిత గోగినేని మాట్లాడుతు : – మా సినిమా థియేట్రికల్ రిలీజ్ కు ముందు, “ఫియర్” ఇప్పటికే 70కి పైగా అంతర్జాతీయ ప్రఖ్యాత సినీ పటకాలకు గెలుచుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ చిత్రం ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. చిత్ర నిర్మాతలు ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
ఈ రోజు, “ఫియర్” చిత్రం టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హీరో రాఘవ లారెన్స్ ఈ సాంగ్‌ను లాంచ్ చేసి, చిత్రానికి తన ఉత్తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
లక్కీ లక్ష్మణ్ సినిమా తో చాలా నేర్చుకున్నాం. అప్పుడు చేసిన తప్పులు ఈ సినిమా లో చేయలేదు.
ఈ సినిమా కి డైరెక్షన్ మరియు ఎడిట్టింగ్ పుణులు కూడా నేనే చేశా. ఈ సినిమా మీద నేను దాదాపు ౩ఏళ్ళు కూర్చుని రాసుకున్న కథ. టైం కూడా వృధా అవ్వకుండా చేసాం. అనుకున్న బడ్జెట్ లో కలవాల్సి నట్టు చేసుకున్నాము.
అనూప్ రూబెన్స్ సంగీతం, కృష్ణకాంత్ పాటల రచనతో, ఈ సాంగ్‌ను మేఘన మరియు నీల్ కృతాన్ అందంగా ఆలపించారు.
పాటలో పల్లవి ఇంగ్లీష్‌లో ఉండగా, ఈ పాట హీరోయిన్లు ఎదుర్కొంటున్న భయాన్ని ప్రతిబింబిస్తుంది.
మా సినిమా దాదాపు 100 + థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది . ఈ నెల 12 తారీఖున ప్రేమెయిర్ వేస్తున్నాం. హైదరాబాద్ మరియు కడప లో ప్రేమిర్స్ వేస్తున్నాం.
సంజు పిల్లలమర్రి
Also read this :గోవాలో ప్రియుడితో కీర్తి సురేష్…