ఉన్నవాణ్ని కొట్టు లేనివాడికి పెట్టు
విడుదల తేది– 24–07025
నటీనటులు– పవన్ కల్యాణ్, బాబిడియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, అయ్యప్ప. పి శర్మ, భద్రం, ఈశ్వరీరావు, వెన్నెల కిశోర్ తదితరులు
ఎడిటర్– ప్రవీణ్ కెఎల్
సినిమాటోగ్రఫీ– మనోజ్ పరమహంస, జ్ఙానశేఖర్
సంగీతం– యంయం కీరవాణి
మాటలు– బుర్రా సాయిమా«దవ్, ప్రణయ్ చంద్ర
నిర్మాత– ఎ.దయాకర్ రావు
సమర్పణ– ఎ.ఎం రత్నం
దర్శకత్వం– క్రిష్ జాగర్లమూడి, ఏ.యం జ్యోతికృష్ణ
కథ–
వరదల్లో నది దాటుతున్నప్పుడు బుట్టలో ఉన్న బిడ్డ తప్పిపోతాడు. ఆ బిడ్డ దేవాలయ పూజారికి దొరుకుతాడు. నదిలోని బిడ్డని గద్దలు ఎత్తుకుపోతుందేమో అనుకుంటే ఆ బిడ్డ గద్దను చూసి నవ్వుతాడు. వెంటనే అక్కడున్న బ్రాహ్మణులు ఆ బిడ్డని కాపాడి దేవాలయంలోకి తీసుకుపోతారు. గరుత్మంతుడు నిలువు నామాల వాడు మనమేమో అడ్డబొట్టుల వాళ్లం ఇప్పుడు బాబుకు ఏ పేరు పెడతారు అని గుడిలోని పూజారి (సత్యరాజ్) ని తమ తోటి పూజారులు అడుగుతారు. అప్పుడు సత్యరాజ్ హరిహరుల పేరు కలిసి వచ్చేటట్లు ఆ బిడ్డకు ‘హరిహర వీరమల్లు’ అని నామకరణం చేస్తాడు. వేదాలు చెప్పే బ్రాహ్మణులు దగ్గరికి చేరతీసిన ఆ బిడ్డ మచిలీపట్నం ఏరియాలో వజ్రాలదొంగగా మారతాడు. అంతటి సనాతన ధర్మంలో పెరిగిన ఆ కుర్రోడు కొంగగా ఎందుకు మారాడు? ఎక్కడో ఆంధ్రలో పుట్టిన ఆ పిల్లోడికి డిల్లీ రాజైన ఔరంగజేబుకు మధ్య వైరం ఏంటి? సనాతన ధర్మం గురించి సినిమాలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇలాంటి ఎన్నో సందేహాలు తీరాలంటే ఖచ్చితంగా వీరమల్లు సినిమాను థియేటర్‌లో చూడాలి…
నటీనటుల పనితీరు–
‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ జీవించేశాడనే చెప్పాలి. అతని ఆహార్యం కూడా కథకు తగినట్లుగా చక్కగా కుదిరింది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్‌లలో పవన్ ఎంతో చాకచక్యంగా నటించినట్లు కనిపిస్తాడు. ఒక్కో ఫైట్స్ ఒక్కో డిఫరెంట్ స్టైల్లో ఉన్నప్పటికి ప్రతిఫైట్ కొత్తగా కనిపిస్తుంది. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో పవన్‌కి జోడిగా చక్కగా కుదిరింది. వీరిద్దరి కెమిస్ట్రీ కొన్ని సీన్లకు హెల్ప్ అవుతుంది. సాంగ్స్‌లో పవన్ ఒళ్లు కదలకుండా సింపుల్ స్టెప్స్‌తో అలరించాడు. రఘుబాబుకి చాలాకాలం తర్వాత పెద్ద పాత్రలో కనిపించారు. ఆయన నటనతో మెప్పించారు. సునీల్, సుబ్బరాజు, నాజర్, సత్యరాజ్ వారి వారి పాత్రల్లో బాగానే కుదురుకున్నారు.
టెక్నికల్ విభాగం–
‘హరిహర వీరమల్లు’ సినిమాకి సంగీతం ప్రాణం అని చెప్పాలి. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు కీరవాణి. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ ను వంక పెట్టలేనంతగా బావుంది. ఎడిటింగ్ వర్క్ చేసిన ప్రవీన్ కత్తెరకు సరైన సమయంలో పనిచెప్పాడు. క్లైమాక్స్‌లో వచ్చే పాట కూడా ఎంతో రక్తికట్టింది. పాట రాసిన రాంబాబు గోసాలకు, పాడినవారందరికి మంచి మార్కులు పడ్డాయి. సాయిమాధవ్ బుర్రా తనదైన మాటల స్టైల్లో అక్కడక్కడ గట్టిగానే చురకలంటించాడు. ఎన్నో విషయాలను గట్టిగా మాట్లాడారు.
ప్లస్ పాయింట్స్–
పవన్ కళ్యాణ్ నటన
పదుౖనైన డైలాగ్స్
ప్రొడక్షన్ వ్యాల్యూస్
ఫైట్స్
మైనస్ పాయింట్స్–
అవసరం లేని చోట పెద్ద నటులు
కొన్ని వీ.యఫ్.ఎక్స్ వర్క్స్
ఫైనల్ వర్డిక్ట్–
సినిమా లవర్స్‌కి పండగా. పవన్ ఫ్యాన్స్‌కి ఒకేసారి మూడు పండగలు వచ్చినంత సంబురం..
రేటింగ్– 3.5/ 5
శివమల్లాల