Happy Birthday Vijay Devarakonda: ఇండస్ట్రీ మెచ్చిన ‘అర్జున్ రెడ్డి’.. ప్రేక్షకులు నచ్చిన రౌడీ హీరో

చిరంజీవి.. నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో తమ ఫుట్ స్టెప్ గట్టిగా వేసిన నటులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే. వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. అందరిలాగే.. రావడం రావడం హీరోగా ఏమీ చేయలేదు. చిన్న నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారాడు. తెలంగాణ యాస.. మన పక్కింటి కుర్రాడో.. ఎదురింటి పిల్లాడులా విజయ్ ప్రేక్షకులకు కనిపించాడు. అంతే అక్కున చేర్చుకున్నారు. ఆ తరువాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విజయ్ కెరీర్‌ను ఊహించనంత ఎత్తుకు చేర్చింది. సినిమాకు విమర్శలు వచ్చినా ప్లస్ అయ్యాయి. ఈ విమర్శలే ప్రమోషన్‌గా మార్చాయి. తిట్టే వారు తిట్టినా.. పొగిడే వారు పొగిడినా సినిమా మాత్రం తన పని తాను చేసుకుపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ గడగడలాడింది. నిర్మాతపై కాసుల వర్షం కురిసింది.

ఆ తరువాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చాలా మంది ఇండస్ట్రీలో హీరోలు.. తమను ఎక్కడ బీట్ చేస్తాడోనని భయపడ్డారని కూడా అప్పట్లో టాక్ నడిచింది. అలా పెద్ద హీరోలను సైతం షేక్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. ఆ తరువాత ఇప్పటి వరకూ ఒక్క హిట్‌కు కూడా నోచుకోలేదు. మరో హీరో అయితే ఇంటి బాట పట్టేవాడే.. కానీ విజయ్ దేవరకొండకు ఏమాత్రం యూత్‌లో క్రేజ్ తగ్గలేదు. రౌడీ హీరో అంటూ ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకున్నారు. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నెక్ట్స్ సినిమా హిట్ అవకపోతుందా? అని ఎదురు చూశారే తప్ప ఆశను మాత్రం వదల్లేదు. ఈ రౌడీ హీరో ఇటీవల ‘కల్కి’లో కనిపించాడు. వెండితెరపై అర్జనుడి అవతారంలో చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. అభిమానుల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తప్పక సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఆశగా ఉన్నారు. మరోవైపు ఈ సినిమాకు నిర్మాత అయిన నాగవంశీ కూడా సినిమా సక్సెస్ అవుతుందని గట్టిగానే చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే విజయ్ దేవరకొండ.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *