Hanuman Movie:ఔను.. అయోధ్య రామమందిరం ట్రస్ట్ కు హనుమాన్ సినిమా యూనిట్ రూ.5 కోట్ల భారీ విరాళం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి.. అంచనాలన్నింటినీ మించి సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
హనుమాన్ సినిమాది అసలైన విజయం అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇవన్నీ ఫేక్ కలెక్షన్లు కావు.. కొన్ని సినిమాల మాదిరిగా
అబద్దపు లెక్కలు కావు అని చెప్పడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఓవర్సీస్ లెక్కల్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మిలియన్
క్లబ్బులో జాయిన్ అవ్వడానికి కొన్ని సినిమాలు నానా తంటాలు పడుతుంటాయి.అలాంటిది ఏకంగా 5 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్ట్ చేసి
నిర్మాతకు ఎన్నో రెట్ల లాభాలను తెచ్చి పెట్టింది హనుమాన్. ఇంత వరకు ప్రభాస్, రాజమౌళి సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ వసూళ్లు అక్కడ
వచ్చాయి. రాజమౌళి డైరెక్షన్ చేసినవి కాకుండా.. మన తెలుగు టాప్ హీరోలు చేసిన చిత్రాలు మూడున్నర మిలియన్ల డాలర్లు మాత్రమే వసూలు
చేశాయి. కానీ, హనుమాన్ మాత్రం ఐదు మిలియన్ల డాలర్లకు పైగానే రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా
గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే చిత్రయూనిట్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కోటి ఫుల్ ఫాల్స్ వచ్చాయని తెలుస్తోంది.
అంటే కోటి టికెట్లు అధికారికంగా తెగినట్లు సమాచారం. సినిమా విడుదల సమయంలోనే.. ప్రతి టికెట్ పైనా రూ.5 అయోధ్య రామమందిరానికి
విరాళంగా ఇస్తామని హనుమాన్ చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే ఇప్పటిదాకా తెగిన కోటి టికెట్ల నుంచి రూ.5 కోట్లు వారు అయోధ్యకు
విరాళాన్ని ఇవ్వబోతోన్నారని ప్రేక్షకులు లెక్కలు వేస్తున్నారు.
హనుమాన్ మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదని మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన హృతిక్ రోషన్ సినిమా ఫైటర్ ఎఫెక్ట్ ఉత్తరాదిలో అంతగా లేదు. దీంతో అక్కడ మరికొన్నాళ్లు హనుమాన్ హవా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు సౌత్‌లో ఈ సినిమాకు ఇంకా డిమాండ్ ఉంది. ఓవర్సీస్‌లోనూ మరో సరైన సినిమా ఇంకా రాలేదు. దీంతో ఇంకో వారం లేదా రెండు వారాలు హనుమాన్ సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ముందు హనుమాన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ వారంలోనే రూ.300 కోట్ల క్లబ్బులోకి చేరుతుందనే అంచనా ఉంది. కానీ, రూ.500 కోట్లు కొల్లగొట్టే వరకు హనుమాన్ జోరు ఆగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.