...

గృహ హింస కేసు నుంచి విముక్తి కల్పించండి: హన్సిక

Hansika Motwani :

హీరోయిన్ హన్సిక తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.

హన్సిక సోదరుడి భార్య, టీవీ నటి ముస్కాన్ జేమ్స్.. ఆమెతో పాటు ఆమె తల్లిపై గృహ హింస కేసు నమోదు చేసింది.

ఈ క్రమంలోనే హన్సిక, ఆమె తల్లికి ముంబయి సెషన్స్‌ కోర్టు ఇటీవల ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ కేసును కొట్టివేయాలంటూ తాజాగా హన్సిక, ఆమె తల్లి ముంబై కోర్టును ఆశ్రయించారు.

జస్టిస్‌ సారంగ్‌ కోత్వాల్‌, జస్టిస్‌ ఎస్‌.ఎం.మోదక్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.

హన్సిక సోదరుడు ప్రశాంత్‌ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్‌ జేమ్స్‌ల వివాహం 2020లో జరిగింది.

ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ వివాహమైన రెండేళ్లకే విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

అదే సమయంలో హన్సికతో పాటు ఆమె సోదరుడు, తల్లిపై ముస్కాన్ గృహ హింస చట్టం కేసు పెట్టింది.

ప్రజావాణి చీదిరాల

Also Read This : ‘డియర్ ఉమ’ ఎప్పుడు వస్తోందంటే..

Harshavardhan Exclusive Interview
Harshavardhan Exclusive Interview

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.