సడెన్‌గా ఓటీటీలోకి హన్సిక హారర్, థ్రిల్లర్ మూవీ

హన్సిక ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘గార్డియన్’. ఈ చిత్రం ఏడాది తర్వాత కనీసం ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో హన్సిక ఒక అందమైన యువతిగానూ.. దెయ్యంగా నటించి మెప్పించింది. దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ రూపొందించిన ఱఈ చిత్రాన్ని ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్ చందర్ నిర్మించారు. ఈ చిత్రంలో తమిళంలో రూపొందగా.. తెలుగులోనూ విడుదలైంది. ఈ సినిమా గతేడాది మే నెలలో విడుదలైంది. తాజాగా ఆహా ఓటీటీలో సడెన్‌గా ప్రత్యక్షమైంది. రొటీన్ హారర్ మూవీగా ‘గార్డియన్’ రూపొందింది. అసలు ఈ సినిమా కథేంటంటే.. ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేసే అపర్ణ (హన్సిక) ఓ ప్రమాదంలో గాయపడుతుంది.

గాయపడిన తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపు తీసుకుంటుంది. పర్ణను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ తరువాత ఆ ఆత్మ అపర్ణతో ఏం చేయించింది. అసలు అపర్ణను పట్టుకున్న ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ప్రవేశించడానికి కారణమేంటి? ఆత్మ కారణంగా అపర్ణ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? వంటి అంశాలతో ీ సినిమా రూపొందింది. ఈ సినిమా తర్వాత అవకాశాలు రాలేదో.. అమ్మడే వద్దనుకుందో కానీ మరో సినిమా అయితే హన్సిక చేయలేదు. తెలుగులో చివ‌ర‌గా ‘105 మినిట్స్’ అనే మూవీలో హన్సిక నటించింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ‘నషా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌తో పాటు బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *