Guinness World Record :చిరంజీవికి గిన్నిస్‌లో స్థానం…

Guinness World Record :

ఇకనుండి చిరంజీవిని పద్మభూషణ్, పద్మవిభూషణ్, గిన్నిస్‌ బుక్‌ అవార్డు విజేత మెగాస్టార్‌ చిరంజీవి అనాలి…

22 సెప్టెంబర్‌ 1978 చిరంజీవి నటించిన తొలిచిత్రం విడుదలైంది. ఆ సినిమా పేరు ‘ప్రాణంఖరీదు’.

సినిమా చూసినవాళ్లంతా ఆ సినిమాలో నటించిన కొత్త కుర్రోడి కళ్లు భలేగా ఉన్నాయి అనుకున్నారు.

నటనతో పాటు తాను మంచి క్రమశిక్షణలవాడని ఎంతో బాగా నటిస్తున్నాడని అతి కొద్దికాలంలోనే చెన్నై మొత్తానికి తెలిసిపోయింది. అవకాశాలు వెల్లువలా వచ్చాయి.

కట్‌ చేస్తే 4 ఏళ్లలో దాదాపు 50 పై చిలుకు చిత్రాల్లో నటించి నటునిగా కెరీర్‌కు డొకా లేకుండా చేసుకున్నారు చిరంజీవి. 1983 చిరంజీవి కెరీర్‌కు బిగ్‌ బ్రేక్‌ అని చెప్పాలి.

అక్కడినుండి చిరంజీవి తన నటనతో ప్రేక్షక హృదయాలను దోచుకుని డైనమిక్‌ హీరోగా, సుప్రీమ్‌ హీరోగా , మెగాస్టార్‌గా తెలుగు సినిమా సామ్రాజ్ఞిపై చక్రవర్తిలా నిలుచున్న సంగతి అందరికి తెలిసిందే.

సరిగ్గా 46 ఏళ్ల తర్వాత తన పేరు పెద్ద తెరపై తాటికాయంత అక్షరాలతో చూసుకున్న అదే రోజే సరిగ్గా 46ఏళ్ల తర్వాత ప్రపంచప్రఖ్యాత గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందారు మెగాస్టార్‌ చిరంజీవి.

ఇది ఒక సామాన్యుడు గిన్నిస్‌ బుక్‌ దాకా వెళ్లటానికి అవకాశముంది అని నిరూపించిన టైమ్‌.

ముఖ్యంగా మిగతా హీరోలందరికంటే చిరంజీవిలో ప్రత్యేకంగా ఏముంది అని చిరంజీవి అలోచించుకుని దానిమీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు.

అదే చిరంజీవిలోని డాన్స్‌…డాన్స్‌ అనగానే కొన్ని తరాలకు చిరంజీవే గుర్తుకు వస్తారు. అలా ప్రతి సినిమాలో అనేక రకాల డాన్సులను చిరంజీవి చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.

అందుకే చిరంజీవిలోని ఈ ప్రత్యేకతను గమనించిన గిన్నిస్‌బుక్‌ అవార్డు కమిటీ ఆయన నటించిన 143 సినిమాల్లోని 537 పాటల్లో 24000 స్టెప్పులు వేసినందుకు చిరుకు గిన్నిస్‌ సత్కారం ఆవిష్కృతమైంది.

ఇకనుండి చిరంజీవిని పద్మభూషణ్, పద్మవిభూషణ్, గిన్నిస్‌ బుక్‌ అవార్డు విజేత మెగాస్టార్‌ చిరంజీవి అని పలకాలేమో?

దేశంలోని ఒక్క విశిష్ట పురస్కారం తప్ప మిగిలిన అన్ని పురస్కారాలు చిరంజీవి కౌగిలిలో కలిసిపోయి ఆ అవార్డులు కూడా చిరు దగ్గర ఉన్నందుకు గొప్పగా ఫీలయ్యేలా ఉన్నాయా అనిపిస్తుంది.

ముఖ్యంగా ఈ కార్రక్రమంలో చీఫ్‌ గెస్ట్‌గా పాల్గొన్న

అమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ :

‘ చిరంజీవి గారు తన అన్ని సినిమాల కెరీర్‌లో ఎక్కడ డాన్స్‌ చేసినట్టు లేదు, ఆయన ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా మనసులో ఉన్న ఆనందంతో ఆడుతున్నట్లు అనిపించింది’ అన్నారు.

నిజంగా చిరంజీవి నటనతో పాటు పెరిగిన 1970, 80, 90స్‌ టైమ్‌లో పుట్టిన ఎవరికైనా ఈ విషయం తెలుసు. అంతలా చిరంజీవి డ్యాన్స్‌లను ఎంజాయ్‌ చేసేవారంటే అతిశయోక్తి కాదేమో.

ఇక్కడ చిరంజీవి తెలివితేటలు గురించి ఆయన నడిచొచ్చిన క్షణాలను ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు అనటానికి ఇదో చిన్న ఉదాహరణ–

ఆయన మాట్లాడుతూ :

‘‘ ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్‌కు ఉండే విలువ అంతా ఇంత కాదు.

వాళ్లు చెప్పిన హీరోలను పెట్టుకుని ఎంత పెద్ద నిర్మాణ సంస్థలైనా, దర్శకులైనా వాళ్లు చెప్పిన పేర్లని పరిగణనలోనికి తీసుకుని సినిమాలు తీసేవాళ్లంటే నమ్మాలి.

అంతగా డిస్ట్రిబ్యూటర్‌కి విలువ ఉండేది. అలాంటి టైమ్‌లో ఒక డిస్ట్రిబ్యూటర్‌ లింగమూర్తి అని ఉండేవారు.

ఆయన చిరంజీవిని పెట్టుకుని సినిమాలు తీయండి ఎక్కువ డబ్బులు ఇస్తాను అని నిర్మాతలకు చెప్పేవారట. ఇదంతా జరిగి 46 ఏళ్లయంది.

గిన్నిస్‌ బుక్‌ అవార్డు వేదికపై చిరంజీవి ఆ విషయాన్ని గుర్తు చేసుకుని చెప్పినట్లుగా మరే హీరో చెప్పలేడు అది చిరంజీవి గొప్పతనం.

తాను నడిచి వచ్చిన ప్రతిక్షణాన్ని ఎంజాయ్‌ చేసినవారు మాత్రమే సందర్భం వచ్చిన ప్రతిసారి సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా కథ చెప్పినట్లుగా చెప్పటం చిరంజీవి తెలివితేటలు.

ఊరికే మెగాస్టార్లు అయిపోరు. చాలా విషయాల్లో విషయం ఉంటేనే ఆ ఫిట్‌ను అందుకుంటారు. అందుకున్న తర్వాత ఆ ఫీట్‌ను నిలుపుకోవటం చాలా కష్టం.

చిరంజీవిగారు ఆ ఫీట్‌ను ఎలా అందుకున్నారు, ఎలా నిలుపుకున్నారు అందరికి తెలిసిన విషయమే.

అందుకే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చెప్పినట్లు రికార్డ్సులో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్సు ఉంటాయి’ అని చిరంజీవి గారు చెప్పిన డైలాగ్‌ అచ్చు గుద్దినట్లుగా ఆయన కెరీర్‌కి సరిపోతుంది.

అందుకే చిరంజీవి అన్ని అవార్డులకు రివార్డులకు నిజమైన అర్హుడు.

ఆల్‌ ది వెరీ బెస్ట్‌ అండ్‌ కంగ్రాట్యులేషన్స్‌ మెగాస్టార్‌ చిరంజీవి గారు అంటూ బెస్ట్‌ విశెష్‌ను తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ మరియు ట్యాగ్‌తెలుగు.కామ్‌ వెబ్‌సైట్‌.

శివమల్లాల

Also Read This : చిరుకి ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డు…

Chiranjeevi Guinness World Record
Chiranjeevi Guinness World Record

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *