గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’.
ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.
మాస్ గెటప్‌లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి శ్రీరామనవమి కానుకగా గ్లింప్స్ విడుదల కానున్నాయని చిత్రయూనిట్ వెల్లడించింది.
ఫస్ట్ షాట్ పేరుతో విడుదల కానున్న ఈ గ్లింప్స్ కోసం మిక్సింగ్ పూర్తైందంటూ
ఏఆర్ రెహ్మాన్‌తో బుచ్చిబాబు సాన ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ఏమై ఫాలింగ్ ఇన్ టు ద లవ్ అని స్టేటస్ పెట్టనా..