జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్ పేరు తెలియని తెలుగువారుండరు.
గత పది సంవత్సరాలుగా అనేక ఎంటర్‌టైన్‌మెంట్ షోలతో టెలివిజన్ రంగంలో తిరుగులేని ఆధిపత్యంతో ముందుకు సాగుతుంది జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్.
ఈ సందర్భంగా జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రతినిధులు అనిల్ కడియాల, ప్రవీణ కడియాల మాట్లాడుతూ :
మా సంస్థ ప్రారంభం నుండి మమ్మల్ని ఎంతో అభిమానించి మాతోపాటు జర్నీ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
ఈ జర్నీలో భాగంగా మేము ఈటీవిలో అనేక షోలను ప్రెజెంట్ చేయటం జరిగింది. అవన్నీ ప్రేక్షకులకు చేరువై మమ్మల్ని విపరీతంగా ఆధరించారు.
ముఖ్యంగా మా షోలు ‘అలీతో సరదాగా’, ‘మనం’, ‘స్వరాభిషేకం’, ‘పాడుతాతీయగా’ ఇలా దాదాపు 20 షోల వరకు చేశాం.
ఇవే కాకుండా ‘శతమానం భవతి’ తదితర సీరియల్ 1200 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది.
త్వరలో ‘వేయి శభములు కలుగు నీకు’ అనే సీరియర్ ప్రారంభం మా జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్ నుండి రాబోతుంది.
ఇలా మేము మా సంస్థ ఈ పదేళ్ల కాలంలో ఎంతో ప్రజాధారణ పొందటంతో జూబ్లిహిట్స్‌లోని పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో
ప్రతి ఏడాది డిసెంబర్ చివరివారంలో మా శ్రేయేభిలాషులందరిని పిలిచి పూజ చేసి లంచ్ ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తుంది’’ అన్నారు.
మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్ తరపున కృతజ్ఞతలు అన్నారు’’ ప్రవీణా, అనిల్ కడియాల….
శివమల్లాల
Also read this : గేదెలరాజు కాకినాడ తాలూకా ఏంటిది ?
