గ్లింప్స్ విడుదల చేసిన ‘గూఢచారి’

అడివి శేష్‌ సినిమా నుంచి అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన కొత్త సినిమా ‘డకాయిట్‌’ నుంచి ఫైర్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అడివి శేష్‌ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా పని చేసిన షానీల్‌ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇద్దరు మాజీ ప్రేమికుల కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. వారు తమ జీవితాలను మార్చుకోవడానికి వరుస దోపిడీలకు ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వారి కథ ఏం మలుపు తీసుకుందనేది కథాంశం.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *