తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు తాజాగా జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ తెలంగాణ అవార్డులను ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి జయసుధ మీడియా సమావేశం నిర్వహించారు. అవార్డుల కోసం మొత్తంగా 1248 నామినేషన్లు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ‘కల్కి’.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2) ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి) ఎంపికయ్యారు.
2024 ఉత్తమ చిత్రాలు..
బెస్ట్ ఫిలిం – కల్కి 2898AD
బెస్ట్ సెకండ్ ఫిలిం – పొట్టేల్
బెస్ట్ థర్డ్ ఫిలిం – లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్(పుష్ప 2)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35)
ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్(కల్కి)
నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం – కమిటీ కుర్రోళ్ళు
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం – 35 ఇది చిన్న కథ కాదు
ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ – రజాకార్
బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ – యదు వంశీ(కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆయ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – SJ సూర్య(సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – భీమ్స్ సిసిరోలియో(రజాకార్)
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సిద్ శ్రీరామ్(ఊరుపేరు భైరవకోన – నిజమే చెబుతున్న సాంగ్)
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రేయ ఘోషల్(పుష్ప 2 – సూసీకి సాంగ్)
బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్(మత్తు వదలరా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ అరుణ్ దేవ్(35 ఇది చిన్నకథ కాదు), మాస్టర్ హారిక(మెర్సీ కిల్లింగ్)
బెస్ట్ స్టోరీ రైటర్ – శివ పాలడుగు(మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి(లక్కీ భాస్కర్)
బెస్ట్ లిరిసిస్ట్ – చంద్రబోస్(రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – విశ్వనాధ్ రెడ్డి(గామి)
బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి(లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ – అరవింద్ మీనన్(గామి)
బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ మాస్టర్ – దేవర – ఆయుధ పూజ సాంగ్
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – అధినితిన్ జిహాని చౌదరి(కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శీను(రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు, అజయ్ కుమార్(కల్కి)
స్పెషల్ జ్యురి అవార్డు(హీరో) – దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యురి అవార్డు (హీరోయిన్) – అనన్య నాగళ్ళ (పొట్టెల్)
స్పెషల్ జ్యురి అవార్డు (డైరెక్టర్) – సుజీత్, సందీప్(క)
స్పెషల్ జ్యురి అవార్డు (నిర్మాత) – ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి(రాజు యాదవ్)
ప్రజావాణి చీదిరాల