యూట్యూబ్‌లో ప్రస్తుతం ‘ఫ్లైట్ ఎక్కి పోదమే దుబాయ్ దేశం’ అనే పాట సంచలనంగా మారింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ వ్యూస్ సాధించి, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అదిరిపోయే స్టెప్స్‌తో బిగ్‌బాస్ ఫేమ్ మానస్ మరియు ముంబై భామ సుప్రియ చవాన్ కలిసి స్క్రీన్‌ను షేక్ చేశారని చెప్పాలి.
ఫణి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ పాట, ఆయన తొలి ప్రాజెక్ట్ అయినప్పటికీ క్వాలిటీ గా ప్రెసెంట్ చేసారనే చెప్పొచ్చు. తెలంగాణ సామెతలు, స్థానిక పదజాలంతో వినసొంపైన లిరిక్స్ రాసిన ఫణి, పాటను conceptualగా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. “ఫ్లైట్ ఎక్కి” అన్నప్పుడు అలా JCB పైకి ఎగిరేలా ఒక మినీ శంకర్ రేంజ్ పాట నే తీసారని చెప్పొచ్చు.
ఉత్తర తెలంగాణ లో ఎంతో మంది భర్తలు తమ భార్యలని వదిలి దుబాయ్ వెళ్లి తమ కుటుంబాలని పోషించుకుంటున్నారు, అలా ఈ పాట లో కూడా భర్త దుబాయ్ వెళ్తా అని భార్య ని అడగడం, దుబాయ్ విశేషాల్ని చెప్పడం, దాన్ని భార్య సున్నితంగా తెలంగాణ పద జాలంతో తిరస్కిరించడం ఈ పాటలో చక్కగా చూపించారు. చివరికి భార్య మాట విని ఇక్కడే ఉన్నాడా లేక దుబాయ్ వెళ్లాడా అనేది మనం పాటలో చూడాలి.
‘రాను ముంబైకి రాను’ ఫేమ్ ప్రభ గాత్రం, గోవింద్ మాస్టర్ స్టెప్స్ పాటకు మరింత ఆకర్షణను జోడించాయి. ప్రస్తుతం “ఫ్లైట్ ఎక్కి… ఫ్లైట్ ఎక్కి…” హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరు ఒకసారి అలా ఒక లుక్కేయండి, స్టెప్పేయండి.
