సినిమా ఓపెనింగ్‌కి కొబ్బరికాయ కొట్టడం షూటింగ్ పూర్తవ్వగానే గుమ్మడికాయ కొట్టడం చిత్ర పరిశ్రమ అలవాటు.
2019లో కొబ్బరికాయలతో ప్రారంభమైన ‘పుష్ప’ సినిమా 2021లో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా సగంలోనే కొనసాగింపు తప్పదు అని సుకుమార్ అండ్ టీమ్ అనుకోవటంతో అప్పుడు గుమ్మడికాయ కొట్టలేదు.
మొత్తానికి ‘పుష్ప’ సినిమా విడుదలకు మరో వారం రోజులు మిగిలి ఉండగా బన్నీ అండ్ టీమ్ దగ్గరుండి సుకుమార్ గారితో ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్న గుమ్మడికాయను కొట్టేశారు.
సుకుమార్ అండ్ టీమ్ కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చేయండి.
ఇక థియేటర్లలో విజిల్స్ మోత ఎప్పుడా అని అందరూ ఎదురు చూడటం ఒక్కటే బ్యాలెన్స్.
అస్సలు తగ్గేదేలే…అంటూ బన్నీ సినిమా 1000 కోట్ల రూపాయల బిజినెస్ మార్క్‌ను దాటుతుందని సినిమా నిపుణుల అంచనా….
శివమల్లాల
Also Read This : వెలుగాక్షరాలు ఆరిపోయాయి…
