Vijay Devarakonda: ‘కింగ్‌డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్.. కొంత స్టోరీని రివీల్ చేసిన మేకర్స్..

ఏదైనా సినిమా విషయంలో కొన్ని కావాలని చేసే లీక్స్ ఉంటాయి.. మరికొన్ని అలా జరిగిపోతుంటాయి. అయితే ‘కింగ్‌డమ్’ చిత్రం ఓ సాంగ్ తాజాగా వచ్చింది. ఈ సాంగ్‌కి ముందు స్టోరీ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు కానీ మొత్తానికి బిగ్ లీక్ అయితే మేకర్స్ ఇచ్చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అయితే ఏమాత్రం ఫీలింగ్స్ లేని ఒక సీరియస్ పర్సన్‌గా కనిపిస్తాడు. హీరోయిన్‌కి లవర్‌గా నటిస్తున్నాడు. ఈ సాంగ్‌కి ముందు ఇది వస్తుంది. ఇక పాట విషయానికి వస్తే ముందుగానే ప్రోమో విడుదల చేసి ఒక హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇవాళ ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు.

‘హృదయం లోపల’ అంటూ సాగే ఈ పాట విజయ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. గాయని అనుమిత నదేశన్‌తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. ఈ గీతానికి కెకె కవితాత్మకమైన సాహిత్యాన్ని అందించగా.. దార్ గై తనదైన కొరియోగ్రఫీతో పాటలోని భావోద్వేగానికి దృశ్య రూపం ఇచ్చారు. అయితే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కల కూడా నెరవేరింది. అదేంటంటే.. అనిరుథ్‌కు ఆయన వీరాభిమాని. నటుడు కావాలనే తన కల నెరవేరితో అతనితో కలిసి పని చేయాలని అనుకున్నానని.. ఆ కల పదేళ్ల తర్వాత తన పదమూడో సినిమాకి నెరవేరిందని తాజాగా రాజీవ్ ‘హృదయం లోపల’ సాంగ్ విడుదల సందర్భంగా ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరోవైపు మేకర్స్ ప్రచారాన్ని ప్రారంభించేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *